కొత్తగూడెం సభలో వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావులపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. ఒక దెబ్బకు మూడు పిట్టలు.. ఒక్క ఓటుతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు.. ఇండిపెండెంట్ వ్యక్తి ఉన్నాడు.. వాళ్లందరూ పోవాలన్నారు. వనమా డైపర్ లేకుండా బయటకు రాలేడు.. ఎవరి ఇంటికైనా వస్తే ఇల్లు ఖరాబు అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Priyanka Gandhi: ప్రభుత్వ విభాగాలు పూర్తిగా అవినీతిమయం.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై ప్రియాంక ఫైర్
‘వనమా కొడుకు జైలుకెళ్లాడు. బీ-ఫారంను.. సింహం గుర్తును కూడా డబ్బులు పెట్టుకుని జలగం వెంకట్రావు కొనుక్కున్నాడు. జలగం వెంగళ్రావు కడుపున వెంకట్రావు ఎలా పుట్టాడో..? పార్టీ మారని కూనంనేని కావాలా..? డైపర్లు వేసుకునే వనమా కావాలా..? తల్లి లాంటి ఎన్నికల గుర్తును కొనుక్కున్న త్రాష్టుడు జలగం వెంకట్రావు కావాలా..? కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది. ఆడవాళ్లు చీరలు వ్యాపారం చేసుకోవాలి కానీ. లిక్కర్ వ్యాపారమేంటీ..? కూతురును కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీతో కలిశాడు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓడితేనే రాష్ట్రం, దేశం బాగుపడతాయి’ అని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.
Also Read: Etela Rajender: పైసా దేనా.. ఓట్ లేనా.. ఇది కేసీఆర్ నైజం