CPI Narayana Slams PM Modi Over Farmers Protest 2024: ప్రజా సమస్యలను వదిలేసి ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. రైతులు ఆందోళనలో ఉంటే జంతువులను వేటాడినట్లు వేటాడుతున్నారని, అన్నదాతలపై యుద్ధం సరికాదన్నారు. దేవుళ్లను కలిసే మోడీ.. సమస్యల్లో ఉన్న ప్రజలను ఎందుకు కలవరు? అని ప్రశ్నించారు. విగ్రహాలు తెచ్చానని గొప్పలు చెప్పుకునే మోడీ.. లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లను ఎందుకు వెనక్కి…
ప్రపంచ సుందరుల పోటీ పెడితే ప్రథమ స్ధానం మోడీదేనంటూ సీపీఐ నారాయణ ఆరోపించారు. అమిత్ షా హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి 12 మందిని చంపి నిర్దోషి అయ్యాడు.. ఇక, ప్రధాని మోడీ ఆర్ధిక ఉగ్రవాది.. అత్యంత క్రిమినల్ గవర్నమెంట్ మన కేంద్రంలో ఉంది అని ఆయన విమర్శించారు.
రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో పని చేస్తామని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. దేశంలో రాజకీయ పార్టీలను భయపెట్టి పాలన సాగిస్తున్న బీజేపీకి ప్రజల చేతిలో ఓటమి ఖాయమన్నారు.
ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అందమైన భాషతో అందమైన అబద్ధాలు నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన అన్నారు. రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
వచ్చే నెల 2, 3 తేదీల్లో తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయ పరిస్థితులు పరిగణనలోకి తీసుకొని చర్చిస్తామన్నారు. దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కక్కిన కూడును తినేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆశపడ్డాడని, కక్కిన కూడు కుక్కలు కూడా తినవ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిని బలహీన పర్చేందుకు బీజేపీ…
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A సుప్రీం కోర్టు భిన్నాభిప్రాయాలు పై సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తాదా, వర్తించదా అనే అంశంపై ఈరోజు తీర్పు రావాల్సి ఉన్నా.. సుప్రీం కోర్టులోనే త్రిసభ్య న్యాయమూర్తులలో భిన్నభిప్రాయాలు వెలువడిందని, ముమ్మాటికి ఇందులో రాజకీయ జోక్యం చోటుచేసుకుందని వ్యాఖ్యలు చేశారు.
CPI Narayana Releases a Video Appealing Pallavi Prashanth to come office: బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డగా ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫినాలే అనంతరం కంటెస్టెంట్స్ దాడి అంశం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పల్లవి ప్రశాంత్ మీద పలు కేసులు నమోదు కాగా ఇప్పటికే అరెస్ట్ కూడా అయ్యాడు. ఇక తాజాగా ఈ అంశం మీద సీపీఐ నారాయణ…