CPI Narayana criticizes BJP party: జీ-20 నాయకత్వం వహించే అవకాశం భారతదేశానికి రొటేషన్ లో భాగంగా వచ్చింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఉండటం వల్లే అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు సీపీఐ జాతీయ నేత నారాయణ. సైద్ధాంతికంగా బీజేపీ వ్యతిరేకించినప్పటికీ ఇవాళ్టి సమావేశంలో డీ. రాజా పాల్గొంటున్నారని అన్నారు. జీ 20 సదస్సులో మహిళా సాధికారత అనే అంశం ఉందని.. దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా ఈ అంశంపై మాట్లాడే…
వివాదాస్పద రుషికొండ నిర్మాణాలపై ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టూరిజం ప్రాజెక్ట్ కోసం ఖరీదైన విల్లాలు తప్ప ప్రచారంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి నివాస భవనాల స్థాయిలో ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదన్నారు. అయితే, పర్యావరణంకు జరుగుతున్న హాని మాత్రం క్షమించరానిది అన్న నారాయణ.. మంత్రులు, సలహాదారులపైన ఫైర్ అయ్యారు. అతి రహస్యం బట్టబయలు అన్నట్టుగా కోర్టు ఆదేశాలతో వస్తే తప్ప నిజాలు ప్రజలకు తెలియకుండా చూడడం సరైన విధానం కాదన్నారు.. ఆగస్టులో…
CPI Narayana: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో ఆరో సీజన్ ప్రసారమవుతోంది. ప్రముఖ హీరో నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. ఈ షో ఒక సాంఘీక దురాచారం వంటిదని విమర్శించారు. బిగ్ బాస్ షోను రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ…
ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోడీ నల్లధనాన్ని ఆపలేకపోతున్నారని విమర్శించారు.. నల్లధనాన్ని అరికట్టడంలో విఫలమైన ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి నిబంధనలు వర్తింవని తెలిసి ప్రైవేటు పరం చేయమని ప్రధానమంత్రి అంటున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, ప్రైవేటు విమానాల్లో అక్రమ నగదు తరలిస్తున్నారని.. దేశంలోని ప్రైవేట్ విమానాలపై నియంత్రణ పెట్టాలని డిమాండ్ చేశారు నారాయణ.. ప్రతి…
CPI Narayana: విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ మహాసభల్లో అమరావతికి మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీకి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని 29 రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి సత్వరమే అమరావతి నిర్మాణం కొనసాగించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. 17…