కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడవేయడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మించి రాజకీయతర కక్ష దాగుందని స్పష్టమవుతోందన్నారు.
సీపీఐ ప్రజా పోరు యాత్రలో భాగంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంచిర్యాల తాండూరు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక ఐక్యతను సాధించడంలో కేసీఆర్ ఫెయిల్ అవుతున్నాడన్నారు. కేంద్రంతో కేసీఆర్ పోరాటం మంచిదే కానీ ముందుగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు.
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ విషయంలో ఇప్పుడు తెలంగాణ సర్కార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వంగా మారిపోతోంది.. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్, వ్యతిరేకమా? అనుకూలమా? అనే విషయం స్పష్టం చేయాలి.. బిడ్‌లో పాల్గొంటే మాత్రం ప్రైవేటీకరణకు మద్దతు తెలిపినట్టే అని ఏపీ మంత్రి గుడివాడ్ అమర్నాథ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఢిల్లీలో మీడియాతో…
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని మోడీ చెప్తున్నారని.. ఆయన అబ్బ సొత్తు ఇచ్చారా అని నారాయణ ప్రశ్నించారు. గంగమ్మ జాతరకు బలిచ్చే మేకను పోషించినట్టు రైల్వేని ఆధునికీకరిస్తున్నారని.. ఆ తర్వాత అవి అమ్మేస్తారని ఆయన ఆరోపించారు.
MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈ రోజు ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి వివిధ పార్టీల నుంచి నాయకులు హాజరయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఒక్కో అడుగు ముందుకు వేద్దాం అని, మహిళలకు ఎవరూ ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదని, అందుకు మహిళా రిజర్వేషన్లను కోరుకుంటున్నామని ఆమె…