Maoist Leader: ఆయుధాలు వదులుకున్న 208 మంది మావోయిస్టులు నేడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ముందు అధికారికంగా లొంగిపోయారు. ఈ తాజాగా బృందం దేశంలోని అనేక ప్రాంతాల్లో చురుగ్గా మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగించింది. లొంగిపోయిన వారిలో అనేక మంది సీనియర్ క్యాడర్లు ఉండటం విశేషం. మావోయిస్టు అగ్రనేత ఆశన్న ప్రముఖుడు. అయితే.. 59 ఏళ్ల తక్కలపల్లి వాసుదేవరావు (ఆశన్న ) బాంబులు తయారు చేసేవాడట. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మద్‌లో చురుకుగా పని చేశారని చెబుతారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్…
Venugopal Rao: మావోయిస్టులకు మరో భారీ దెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో సీపీఐ (మావోయిస్టు) పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను తనతో పాటు 60మంది మావోయిస్టు కేడర్లు ఆయుధాలు వదిలి లొంగిపోయారు. దండకారణ్య ప్రాంతంలో కీలక పాత్ర పోషించిన సోను లొంగిపోవడంతో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా బలహీనపడినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గత సెప్టెంబర్‌లో సోను ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, తాను మావోయిస్టు మార్గాన్ని వదిలి…
నిషేధిత సీ.పి.ఐ మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి, సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యుడు, దండాకారుణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందిన మంద రూబెన్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎదుట లొంగిపోవడం సంచలనంగా మారింది.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మావోల నుంచి కాల్పులు విరమణ ప్రతిపాదన వచ్చిన తర్వాత, ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులతో కాల్పుల విరమన ప్రసక్తే లేని ఆదివారం అన్నారు. శాంతిని కోరుకునే వారు వెంటనే లొంగిపోవాలనే హెచ్చరికలు జారీ చేశారు.
Maoists: కేంద్రం మావోయిస్టులకు వ్యతిరేకం నిర్వహిస్తున్న ‘‘ఆపరేషన్ కగార్’’ దెబ్బకు పలువురు మావోయిస్టుల లొంగిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.64 లక్షలు రివార్డు ఉన్న 30 మందితో సహా 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 17 బాలుడు, 16,17 ఏళ్లు కలిగిన ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దంతేవాడ పోలీసులు వెల్లడించారు.
మావోయిస్టు పార్టీ లోపల విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇటీవల విడుదల చేసిన "సాయుధ పోరాట విరమణ" ప్రకటనపై మావోయిస్టు నాయకత్వం తీవ్రంగా స్పందించింది.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్-బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దు ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రముఖ నక్సల్ నాయకుడు బసవరాజు సహా 27 మంది నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయి. నక్సలిజంపై పోరాటంలో ఈ ఆపరేషన్ ఒక పెద్ద విజయంగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.
Maoist Arrest : తెలంగాణలోని బీర్‌పూర్ గ్రామానికి చెందిన సీనియర్ నక్సలైట్ నాయకుడు, ప్రభాకర్‌గా ప్రసిద్ధి చెందిన బల్మూరి నారాయణరావును ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. నారాయణరావు నాలుగు దశాబ్దాలుగా అండర్‌గ్రౌండ్‌గా ఉన్నారు , సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా ఉన్న మరో అగ్ర నక్సల్ నాయకుడు ముప్పాల లక్ష్మణరావుకు దగ్గరి బంధువు. లక్ష్మణరావు కూడా బీర్‌పూర్ గ్రామానికి చెందినవాడు. అరెస్టయిన మావోయిస్టు నాయకుడు మావోయిస్టు పార్టీకి చెందిన మొబైల్ పొలిటికల్ స్కూల్ (మోపోస్) ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు,…