కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీ మాజీ సిఎం దిగ్విజయ్ సింగ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఢిల్లీ లోని తన నివాసం లో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన పార్టీ నేతలు, ఇతరులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. కొన్ని రోజులపాటు హోమ్ క్వారెంటైన్ ఉండాలని కోరారు దిగ్విజయ్ సింగ్. ఇది ఇలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,91,917కి చేరింది. ఇందులో 1,25,47,866 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,69,743 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1185 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,74,308కి చేరింది.