కరోనా అయిపోయింది అనుకోవద్దు..అందరూ రెండు డోసులు తీసుకోవాలి.. కరోనా ప్రభావం ఉంది.. వాక్సిన్ తీసుకున్న వాళ్లకు ప్రమాదం లేదన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయినా, ప్రజలంతా అప్రమత్తంగా వుండాలన్నారు. థర్డ్ వేవ్ వస్తుందో రాదో తెలియదని, ప్రభుత్వం మాత్రం సన్నద్దంగా ఉందన్నారు. ప్రజలెవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ఇకపై ఆక్సిజన్ లోటు రాదన్నారు. కరోనా వ్యాక్సినేషన్ వేగంగా పూర్తవుతోందన్నారు. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో…
మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 18 వేలు క్రాస్ చేసిన కరోనా మహమ్మారి కేసులు.. ఇవాళ ఏకంగా 15 వేలకు తగ్గుమఖం పట్టాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 15,786 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 231 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,75,745 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో…
తిరుమల శ్రీ వారి భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన టిక్కెట్లను ఇవాళ విడుదల చేయనున్నారు.. ఇందులో భాగంగానే ప్రతి రోజూ 12 వేల చొప్పున టికెట్లను విడుదల చేసేందుకు టీటీడీ పాలక మండలి సిద్ధమైంది… ఇక రేపు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది టీటీడీ. నవంబర్ నెలకు సంబంధించి…
భారతదేశం వందకోట్ల టీకాల మైలురాయిని దాటి ఒక సరికొత్త చరిత్రను ఈరోజు సృష్టించింది. ఈ సందర్భంగా కోవిడ్ యోధులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు.మహమ్మారి పై పోరాటం లో భాగంగా వందకోట్ల టీకా డోసులు అందించి భారతదేశాన్ని సగర్వంగా నిలిపిన సైంటిస్టులకు, టీకా తయారీదారులకు సెల్యూట్ అంటూ తెలంగాణ గవర్నర్ డా.తమిళసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. భారతీయురాలిగా ఈ ఘనత సాధించినందుకు గర్వపడుతున్నాను. 100 కోట్ల టీకా డోస్ లు పంపిణీ మార్క్ ని చేరడం సంతోషంగా ఉంది.…
రష్యాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతున్నది. ప్రతిరోజూ వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను రష్యా మొదటగా తయారు చేసినప్పటికీ, వ్యాక్సినేషన్ మిగతా దేశాలతో పోలిస్తే మందకోడిగా సాగుతున్నది. దీంతో కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. కట్టడి చేసేందుకు రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రికార్డ్ స్థాయిలో కేసులు పెరుగుతుండటంతో ఉద్యోగులను వారం రోజులపాటు పని ప్రదేశాలకు దూరంగా ఉంచితే మంచిదని ప్రభుత్వం భావించింది. అక్టోబర్ 30…
ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 44, 086 శాంపిల్స్ పరీక్షించగా.. 523 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 608 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయి లో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ…
తెలంగాణ కరోనా పరిస్థితులు మరియు వ్యాక్సినేషన్ పై రాష్ట్ర వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణా లో ఒకట్రెండు రోజుల్లో 3 కోట్ల డోసులు వాక్సినేషన్ పూర్తి కానుందని.. 75 శాతం మందికి మొదటి డోస్ అలాగే… 39 శాతం రెండో డోస్ పూర్తయిందని వెల్లడిచింది ఆరోగ్య శాఖ. 50 లక్షల వాక్సిన్ నిల్వ తెలంగాణ లో ఉందని… 0.4 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు నమోదైందని పేర్కొంది. ప్రస్తుతం కోవిడ్ అదుపులో ఉందని… వాక్సిన్ వల్ల…
తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం పునరుద్దరించలేదని టీటీడీ తెలిపింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశారు టీటీడీ అధికారులు. ఇప్పటికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం…
కరోనాతో ఏపీలో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించారు. వచ్చే నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. అలాగే రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, ప్రభుత్వ…