కరోనా మహమ్మారికి ప్రపంచ వ్యాప్తంగా 49 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శాస్త్రవేత్తల నిరంతర శ్రమ కారణంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మహమ్మారులకు వ్యాక్సన్‌ను తయారు చేయాలి అంటే కనీసం ఐదారేళ్ల సమయం పడుతుంది. కానీ, కరోనా నుంచి కోలుకోవాలి అంటే వ్యాక్సిన్ తప్పనిసరి కావడంతో ప్రపంచం మొత్తం వ్యాక్సిన్‌పైనే దృష్టి సారించింది. ఆరునెలల కాలంలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత…
ఇండియాలో మరోసారి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 13, 596 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 166 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19, 582 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.40 కోట్లకు పైగా పెరగగా..…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31, 712 శాంపిల్స్ పరీక్షించగా.. 432 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 05 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 586 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,…
కరోనా క్రైసిస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. అందుకే ఆదివారం రోజు తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని పిలిచి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేదికపై అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు…
తెలంగాణాలో మద్యం అమ్మకాలు మళ్లీ పెరిగాయ్. ప్రస్తుతం కోవిడ్ చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో బార్లకు వెళ్లి మద్యం సేవించేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ చెబుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే.. ప్రస్తుతం దాదాపుగా 29 శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం తో సర్కార్ ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది. కరోనా టైంలో బీర్ల వినియోగం చాలా వరకు పడిపోయింది. అమ్మకాలు లేకపోవడంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని తగ్గించాయి. కూల్ డ్రింక్స్,…
తెలంగాణలో జనం మళ్లీ మాస్కులు పడేసి గుంపులు గుంపులు తిరుగుతున్నారు.అయితే కరోనా మాత్రం ఇంకా పోలేదంటున్నారు నిపుణులు. లాక్‌డౌన్ సమయంలో ఎలా అయితే జాగ్రత్తలు తీసుకున్నారో.. ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలంటున్నారు. ఫస్ట్ వేవ్ , సెకండ్ వేవ్‌తో కరోనా అంతం కాలేదని… థర్డ్‌వేవ్ కూడా పొంచి ఉందటున్నారు వైద్యులు. లాక్ డౌన్ సమయానికంటే ఆతర్వాతే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని లేదంటే… మళ్లీ కరోనా ఎటాక్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ నెల…
హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైనప్పటి నుంచి రాజకీయ నాయకుల ఫోకస్ అంతా ఇక్కడే నెలకొంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ తగ్గెదెలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో నేతలంతా ఓటర్లు చుట్టూ తిరగాల్సిన ఉండగా ఆసుప్రతుల చుట్టూ తిరుగుతుండటం ఆందోళన రేపుతోంది. హుజూరాబాద్ లో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య నెలకొంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ కు…
తెలంగాణ కరోనా కేసులు రోజు రోజు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40, 354 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 183 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో ఇద్దరు వ్యక్తులు కోవిడ్ బారినపడి మృతిచెందాడు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,070 కి చేరగా.. రికవరీ కేసులు 6,59,942 కి పెరిగాయి.. ఇక,…
టెన్త్ పరీక్షా పేర్లను కుదించారు. ఈ ఏడాది పదో తరగతిలో ఆరు పరీక్షలే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 11 పేపర్లకు బదులుగా ఆరు పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే.. ఈ సారి పరీక్ష సమయం 2 గంటల 45 నిమిషాల నుండి 3…
ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు భారీ తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 23, 022 శాంపిల్స్ పరీక్షించగా.. 310 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 994 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,87,67, 963 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,57, 562 కు పెరిగింది..…