మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 18 వేలు క్రాస్ చేసిన కరోనా మహమ్మారి కేసులు.. ఇవాళ ఏకంగా 15 వేలకు తగ్గుమఖం పట్టాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 15,786 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 231 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు..
ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,75,745 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరోవైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు వంద కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 13,24,263 మందికి కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్యశాఖ. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 59,70,66,481 కు చేరుకుంది.