తిరుమల శ్రీ వారి భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన టిక్కెట్లను ఇవాళ విడుదల చేయనున్నారు.. ఇందులో భాగంగానే ప్రతి రోజూ 12 వేల చొప్పున టికెట్లను విడుదల చేసేందుకు టీటీడీ పాలక మండలి సిద్ధమైంది… ఇక రేపు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది టీటీడీ. నవంబర్ నెలకు సంబంధించి రోజుకి 10 వేల చొప్పున టిక్కెట్లను విడుదల చేయనున్నారు అధికారులు. మరోవైపు 25వ తేదీన నవంబర్ నెలకు సంబంధించి వసతి గదుల కోటాను విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇక, తిరుమలకు వచ్చే భక్తులను అలర్ట్ చేసింది టీటీడీ. తిరుమలకు వచ్చే వారు… రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికేట్ మరియు మూడు రోజుల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని.. నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకు రావాలని స్పష్టం చేసింది.