భారత్‌లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న 87 కేసులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 101 కి చేరింది. దేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మహారాష్ట్రలో అత్యధికంగా 32 కేసులు ఉండగా, ఢిల్లీలో ఈ సంఖ్య 22 కి చేరింది. రాజస్థాన్‌లో 17, కర్ణాటక, తెలంగాణలో 8 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కట్టడికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని, అందరూ తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని…
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8 కి చేరింది. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఇటీవలే ఆ మహిళ విదేశాల నుంచి వచ్చినట్లు హెల్త్ డైరెక్టర్ పేర్కొన్నారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి ఒమిక్రాన్ వచ్చిందని.. మిగతావి నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికి వచ్చినట్లు వెల్లడించారు. ఒమిక్రాన్…
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,447 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 391 మంది కోవిడ్ బాధితులు మృతి చెంచారు.. ఇదే పమయంలో 7,886 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు తన బులెటిన్‌లో పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ప్రస్తుతం దేశ్యాప్తంగా 86,415 యాక్టివ్ కేసులు…
భారత్‌లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో టెన్షన్ పెరిగిపోయింది. ఐదు రోజుల క్రితం కర్ణాటకలో మూడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఆ తరువాత దేశంలోని చాలా రాష్ట్రాల్లో వరసగా కేసులు మొదలయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 87 కి చేరింది. ఈరోజు తెలంగాణలో నాలుగు కేసులు నమోదవ్వగా, కర్ణాటకలో 5 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలోని కర్ణాకటలో 8, తెలంగాణలో 7, ఢిల్లీలో 10, మహారాష్ట్ర 32, రాజస్థాన్ 17,…
దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వేరియంట్ 70 దేశాలకు పైగా పాకేసిందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ వేరియంట్ మన దేశంలోనూ క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7 గా నమోదు అయింది. అయితే.. ఇవాళ…
ప్రకాశం : ఒంగోలులో ఒమిక్రాన్ కేసుల కలకలం రేపింది. నగరంలోని భాగ్యనగర్ 4వ లైనులోని ఓ అపార్ట్మెంట్ లో రెండు కేసులు నమోదయ్యాయంటూ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారింది ఓ ఆడియో. ఇప్పటి వరకు విదేశాల నుండి వచ్చిన 784 మందిని గుర్తించారు వైద్యశాఖ అధికారులు. 400 మందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు. మరో 384 మందికి పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుండి తిరిగి వచ్చి ట్రేస్ అవుట్…
రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో ప్రపంచంలోని సంహభాగం దేశాలు భారీగా అప్పులు చేశాయి. అగ్రదేశాలు సైతం పెద్ద మొత్తంలో అప్పులు చేశాయి. ఆ తరువాత క్రమంగా ఆర్ధికంగా దేశాలు కోలుకోవడంతో అప్పుల భారం తగ్గించుకుంటు వచ్చాయి. ఇన్నేళ్ల తరువాత మళ్లీ కరోనా విజృంభణ సమయంలో ప్రపంచ దేశాలు భారీ స్థాయిలో అప్పులు చేసినట్టు ఐఎంఎఫ్ ప్రకటించింది. Read: విమానం ఎక్కే అవకాశం లేక…సొంతంగా విమానం తయారు చేశాడు… ఐఎంఎఫ్ నివేదికల ప్రకారం 2020లో ప్రపంచ దేశాలు…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా సార్స్‌కోవ్ 2 వైరస్ మొదట చైనాలోని పూహన్‌లో కనిపించింది. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం వ్యాపించింది. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యి ఉంటుందని చాలా కాలంగా అమెరికా అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నది. అయితే, చైనా అలాంటిది ఏమీ లేదని, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని, అక్కడి నుంచి ఇతరులకు వ్యాపించిందని చెప్తూ వచ్చింది. అయితే, కెనడాకు చెందిన నిపుణులు సైతం…
ఏపీ లో కరోనా కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ 33,043 శాంపిల్స్ పరీక్షించగా.. 148 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ముగ్గురు కోవిడ్ బాధితులు మృతి చెందారు.. ఇదే సమయంలో 152 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,08,95,748 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2075419 కు పెరిగింది.. ఇక, రికవరీ…
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కరోనా వైరస్‌లోని ఒక వేరియంట్ ఇది. సార్స్ కోవ్ జాతిలో అనేక మ్యూటేషన్ల కారణంగా పుట్టుకొచ్చింది ఈవేరియంట్. ఇందులో 30కి పైగా మ్యూటేషన్లు ఉండటంతో వ్యాధిని వేగంగా వ్యాపింపజేస్తున్నది. ఒమిక్రాన్‌ను నిరోధించాలంటే స్పైక్ ప్రోటీన్లను తొలగించాలి. దీనికోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. Read: కరోనా వ్యాప్తికి ఇదే కారణమా…! ఇక ఇదిలా ఉంటే,…