కంటికి కనిపించని మాయదారి కరోనా మహమ్మారి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా ఎటాక్ చేస్తోందో తెలియని పరిస్థితి.. అందుకే భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని, శానిటైజర్లు వాడాలని, గుంపులుగా ఉండొద్దని ఎంత ప్రచారం చేసినా.. కొందరు పెడచెవిన పెడుతూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకే కాలానికి చెందిన 35 మంది యువకులు కోవిడ్ బారినపడ్డారు.. తీరా ఆరా తీస్తే.. వాళ్లు అంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ అడినట్టు చెబుతున్నారు..…
కరోనా మహమ్మారి చాలా దేశాల కంటిపై కునుకు లేకుండా చేసింది.. ఏ దేశంలో గణాంకాలు పరిశీలించిన.. భారీగా కేసులు, పెద్ద సంఖ్యలో మృతుల సంఖ్య కలవరపెట్టింది.. ఇక, ఫ్రాన్స్‌ను కూడా అతలాకుతలం చేసింది కోవిడ్.. అయితే, ఇప్పుడు క్రమంగా అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.. కేసులు తగ్గిపోయాయి.. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా పుంజుకుంది… దీంతో.. కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రాన్స్.. ఈ నెల 20వ తేదీ నుంచి రాత్రికర్ఫ్యూను సడలించాలనే నిర్ణయానికి వచ్చింది. అంతేకాదు, ఇకపై బహిరంగ…
ఇండియాలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 1,14,460 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,09,339 కి చేరింది. ఇందులో 2,69,84,781 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,77,799 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 2,677 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య…
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోన్న సమయంలోనే.. థర్డ్ వేవ్ ముప్పు ఉందనే హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి… ఇక, థర్డ్ వేవ్‌లో చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందన్న ముందస్తు హెచ్చరికలతో.. చిన్నారులు కోవిడ్ బారినపడితే.. ఎలా అనేదానిపై ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి.. మరోవైపు.. కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ సమయంలోనే పెద్ద ఎత్తున చిన్నారులు కూడా మహమ్మారి బారినపడ్డారు. మరోవైపు.. కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వాక్సినేషన్.. కానీ, భారత్ ఇప్పటి…
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 1,20,529 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,94,879 కి చేరింది. ఇందులో 2,67,95,549 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,55,248 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 3,380 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,44,082 కి చేరింది. ఇక ఇదిలా…
ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మళ్లీ మందు పంపిణీ ఏర్పాట్లలో మునిగిపోయారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. అయితే, మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దు అని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు… జిల్లాకు 5 వేల చొప్పున మందులు పంపుతామని.. అధికారులు వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. మరి ఆనందయ్య మందు పంపిణీ ఎప్పటి నుంచి అని అంతా ఎదురుచూస్తోన్న సమయంలో.. సోమవారం నుండి అందుబాటులోకి…