చిన్న పిల్లల వ్యాక్సిన్ కూడా వచ్చేస్తోంది…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోన్న సమయంలోనే.. థర్డ్ వేవ్ ముప్పు ఉందనే హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి… ఇక, థర్డ్ వేవ్‌లో చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందన్న ముందస్తు హెచ్చరికలతో.. చిన్నారులు కోవిడ్ బారినపడితే.. ఎలా అనేదానిపై ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి.. మరోవైపు.. కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ సమయంలోనే పెద్ద ఎత్తున చిన్నారులు కూడా మహమ్మారి బారినపడ్డారు. మరోవైపు.. కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వాక్సినేషన్.. కానీ, భారత్ ఇప్పటి వరకు 18 ఏళ్ల పైబడినవారికి మాత్రమే వాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అయితే, త్వరలోనే చిన్నారులకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.. దీనిపై జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్.. ఇప్పటికే పని మొదలుపెట్టాయి.. మరో రెండు వారాల్లో జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం అనుమతించాలంటూ.. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేయడానికి సైతం సిద్ధం అవుతున్నాయి.. జైడస్ క్యాడిలా వ్యాక్సిన్‌ను జైకోవ్-డీ (ZyCoV-D) పేరుతో తయారు చేస్తున్నారు.. దీనికి అనుమతి వస్తే.. చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్ మొదటలుపెట్టనున్నారు.
ఇప్పుడు జైకోవ్-డీ వ్యాక్సిన్ ఒక్కటే కాదు.. మరికొన్ని రోజుల్లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్ పూర్తికానున్నాయి.. భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ టీకాను ప్రస్తుతం 2-17 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుండగా.. జైడస్ 12-18 ఏళ్ల పిల్లలపై ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఇక, 5-12 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలపై కూడా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తోంది.. మరోవైపు.. వ్యాక్సిన్ తొలి, రెండో దశ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చినట్టు చెబుతున్నారు.. టీకాకు అనుమతులు వస్తే.. ఏడాదికి 240 మిలియన్ డోసులను తయారీ చేయాలని జైడస్ ప్లాన్‌గా ఉంది. మొత్తంగా థర్డ్ వేవ్ భయలు వెంటాడుతోన్న తరుణంలో సాధ్యమైనంత త్వరగా చిన్నపిల్లల వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తే.. కోవిడ్‌ను ఎదుర్కోవడం కష్టమేం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..