కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న సమయంలో.. పలు రకాల రీసెర్చ్‌లు కోవిడ్ తీవ్రతను అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. దేశంలో క్రమంగా కోవిడ్ మీటర్ మరోసారి పైకి పరుగులు పెడుతోన్న సమయంలో.. ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎబ్బీఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.. భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది ఎస్బీఐ రీసెర్చ్.. ఇప్పటికే…
తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామన్నారు వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్దం చేయాలని ఆదేశించారు. ప్రపంచ వ్యాప్త కరోనా పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సౌకర్యం సిద్దం చేయాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలి, రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని హరీష్ రావు సూచించారు. కరోనా తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు.…
ప్రపంచదేశాలను ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి వణికిస్తోంది.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది… ఇదే సమయంలో.. ఒమిక్రాన్ అంత సీరియస్ కాదనే వాదనలు కూడా ఉన్నాయి.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే జెట్ స్పీడ్‌తో విస్తరిస్తున్నా.. ప్రాణాలకు ముప్పులేదని.. డెత్ రేట్ తక్కువని చెబుతున్నారు.. కానీ, ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు.. ఇప్పటికే ఫస్ట్ వేవ్ చూశాం.. కోవిడ్ సెకండ్ వేవ్ సృష్టించిన విలయాన్ని ఇంకా మర్చిపోలేదు.. ఇప్పుడు…
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది… ఇప్పటికే భారత్‌లో ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోవడమే కాదు.. ఆర్థికంగా కూడా అన్ని రంగాలను దెబ్బ కొట్టింది ఈ మహమ్మారి.. మరోవైపు… సౌతాఫ్రికాలో తాజాగా వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అన్ని దేశాలను టెన్షన్ పెడుతోంది.. డెల్టా వేరియెంట్ తగ్గుముఖం పట్టిందని సంతోషించే లోపే.. ఒమిక్రాన్ రూపంలో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది..…
దేశంలో కోవిడ్ తగ్గుముఖం పట్టింది.కొన్ని నెలలుగా కేసుల సంఖ్య స్థిరంగా తగ్గుతోంది. పండుగ సీజన్‌లో కూడా కేసుల పెరగకపోవటం సంతోషాన్నిస్తోంది. అక్టోబరు,నవంబర్ నాటికి థర్డ్ వేవ్ పీక్‌కి చేరుకుంటుందని అంటువ్యాధుల నిపుణులు మొదట అంచనా వేశారు. ఈ ఏడాది మేలో రోజుకు నాలుగు లక్షల పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అది పది వేలకు పడిపోవటం కరోనా సెకండ్ వేవ్ క్షీణతను సూచిస్తోంది. చాలా రాష్ట్రాల్లో కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు…
ఓ పక్క కేసులు తగ్గాయన్న సంతోషం… మరోవైపు థర్డ్ వేవ్ మొదలైందన్న ఆందోళన. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం క్రాస్ రోడ్స్‌లో ఉన్నాం. దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గడం ఊరటనిస్తోంది. కొత్తగా 31వేల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవగా.. మరణాలు 300 దిగువకు తగ్గాయి. ఇక వరుసగా రెండో రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. అయితే ఇదే సమయంలో దేశంలో థర్డ్ వేవ్ పాదం మోపటం ఓ…
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు పూర్తిగా అదుపులోకి రాకముందే.. మళ్లీ రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. దీంతో కొత్త ప్రమాదం పొంచిఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. దేశంలో మరో కొత్తరకం కరోనా వైరస్ సెప్టెంబర్ నెలలో వెలుగు చూస్తే.. అక్టోబర్-నవంబర్ మధ్య కాలంలో గరిష్ఠానికి చేరుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. సెకండ్ వేవ్‌తో పోలిస్తే దాని తీవ్రత అతి స్వల్పంగానే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశంలో కరోనా మూడో ముప్పు అనివార్యమని…
కోవిడ్ థర్డ్ వేవ్ గురించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నందుకు ఇంజనీర్ పరుచూరి మల్లిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ జి. శ్రీనివాస్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇదివరకే నోటీసులు పంపించారు. పరుచూరి మల్లిక్ ఓ టీవీ టాక్ షోలో పాల్గొని, కరోనా థర్డ్ వేవ్‌లో ప్రతి ఒక్క ఇంటి నుంచి మరణం సంభవిస్తుందని వ్యాఖ్యలు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, సుల్తాన్…
కరోనా థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం, భయపడకుండా ఉండటమే దీనికి మంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించడమే థర్డ్‌వేవ్ ముప్పు నుంచి రక్షణ పొంగలగమన్నారు. వైద్యులకు నాదో చిన్న విన్నపం. థర్డ్‌వేవ్‌పై భయాందోళనలు సృష్టించవద్దు. ఎందుకంటే దీనికి ప్రాథమిక సూత్రం ముందు జాగ్రత్తే గాని భయాందోళనకు గురికావడం కాదు” అని సూచించారు. థర్డ్‌వేవ్ గురించి మాట్లాడేందుకు బదులుగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సెకండ్ వేవ్‌పై…
కరోనా మహమ్మారి ఇంకా అతలాకుతలం చేస్తూనే ఉంది.. ఫస్ట్ వేవ్ లో భారీగా కేసులు నమోదు అయ్యి, మృతుల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనే ఉండగా.. ఇక, సెండ్ వేవ్ గుబులు పుట్టించింది.. కోవిడ్ బారినపడి ఆస్పత్రికి వెళ్లినవారు తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేని పరిస్థితి.. రోజుకో రికార్డు సంఖ్యలో కేసులు వెలుగు చూస్తే.. మృతుల సంఖ్య కూడా భారీగా నమోదవుతూ కలవరం పుట్టించింది.. ఇక, థర్డ్ వే హెచ్చరికలు భయపెడుతోంది.. ఇప్పటి వరకు ఆ మహమ్మారితో…