సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘సూపర్’ చిత్రంతో 2005లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తన విలక్షణ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన అనుష్క… వరుసగా విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా అవతరించింది. బాహుబలి సిరీస్‌లో దేవసేనగా ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే బాహుబలి తరువాత అనుష్క సినిమాలను బాగా తగ్గించింది. తరువాత ఆమె నటించిన భాగమతి, నిశ్శబ్దం చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అయితే దర్శకుడు మహేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనుష్క షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా లేదంట. అందుకే సినిమాలకు డేట్లు కూడా కేటాయించడం లేదట…! మరోవైపు రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో సినిమా షూటింగ్ లు రద్దు చేసుకుంటున్నారు. పలువురు స్టార్స్ తమ సినిమాల విడుదలకు కూడా వాయిదా వేసుకున్నారు.