తగ్గేదేలే అంటున్న ఆ నిర్మాతలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతానికి కుదించారు. తెలంగాణాలో రాత్రి కర్ఫ్యూ ఉన్న కారణంగా సెకండ్ షోస్ ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పలు చిత్రాల విడుదల వాయిదా పడింది. దాంతో తెలంగాణలో థియేటర్లను ఈ నెలాఖరు వరకూ మూసేయాలనే నిర్ణయం వాటి యాజమాన్యం స్వచ్ఛందంగా తీసుకుందని, అయితే ‘వకీల్ సాబ్’ మాత్రం రెండు రోజులు ప్రదర్శిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ నిర్ణయంతో కొందరు థియేటర్ల యజమానులు విభేదించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… రాబోయే శుక్రవారం విడుదల కావాల్సిన ‘తలైవి, ఇష్క్, తెలంగాణ దేవుడు’ చిత్రాలు వాయిదా పడినా… ఓ నాలుగు చిత్రాల నిర్మాతలు మాత్రం ‘తగ్గేదేలే’ అంటున్నారు. ‘శుక్ర, కథానిక, రావే నా చెలియా, మా వూరి ప్రేమకథ’ చిత్రాలను ఈ శుక్రవారం బరాబర్ రిలీజ్ చేస్తామంటూ సదరు నిర్మాతలు థియేటర్ల పట్టికతో సహా ప్రకటన ఇచ్చారు. సినిమా హాల్స్ ను మూసేస్తే తప్పితే ఇవి విడుదల కాకుండా ఆగవు… మరి శుక్రవారం తర్వాత కూడా ‘వకీల్ సాబ్’ను ప్రదర్శిస్తారా? కొత్త సినిమాలను విడుదల చేయనిస్తారా? అనేది వేచి చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Indian Player: అనూహ్యంగా టీమ్ ఇండియాలోకి ముంబై ఆల్‌రౌండర్.. జూన్ 26 నుంచి బరిలోకి..
-
CM Chandrababu Warning: పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
Jagadish Reddy: కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్.. రేవంత్ రెడ్డి ఒక ‘హైబ్రిడ్ సీఎం’
-
Tragedy: పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం..
-
Bangladesh: బంగ్లాదేశ్‌కు చైనా యుద్ధ విమానాలు.. భారత్‌కు సవాలేనా.?
ట్రెండింగ్
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!