పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఐసోలేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి భారీ బడ్జెట్ మూవీలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ మేకప్ ఆర్టిస్ కరోనా బారిన పడ్డారట. దీంతో ప్రభాస్ తో పాటు ‘రాధే శ్యామ్’ టీం మొత్తం ఐసోలేషన్ లో ఉంటున్నట్టు సమాచారం. ‘రాధే శ్యామ్’ మేకర్స్ ప్రస్తుతానికి షూటింగ్ షెడ్యూల్ ను నిలిపివేశారు. కరోనా మహమ్మారి సాధారణ పరిస్థితికి వచ్చాక సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. పీరియాడికల్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’కు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా… పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది జూలై 30న ‘రాధే శ్యామ్’ విడుదల కానుందని ఇంతకుముందు మేకర్స్ ప్రకటించారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు. ఇక ‘రాధేశ్యామ్’ కూడా వాయిదా పడే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. కానీ ‘రాధే శ్యామ్’ సినిమా విడుదల వాయిదా గురించి మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.