మాయదారి మహమ్మారి కరోనాకు చెక్ పెట్టడానికి ఉన్న ఒకే ఒక మర్గం వ్యాక్సినేషన్.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ఆగిపోయే పరిస్థితి నెలకొంది.. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఉన్న మొత్తం వ్యాక్సినేషన్‌ను పంపిణీ చేశారు వైద్య సిబ్బంది.. దీంతో.. కేంద్రం వ్యాక్సిన్ డోసులు పంపేవరకు వేచిచూడాల్సిన పరిస్థతి. ఇటీవలే కేంద్రం నుంచి వచ్చిన 6 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు సిబ్బంది.. దీంతో.. ఏపీలో జీరోకు పడిపోయాయి వ్యాక్సిన్ నిల్వలు.. మరోవైపు.. మరిన్ని డోసులు కావాలంటూ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’ షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో కోవిడ్ -19 కేసులు వేగంగా పెరుగుతున్నందున సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగ్స్ ను నిలిపివేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి అన్ని పబ్లిక్, ప్రైవేట్ ఇంస్టిట్యూషన్స్, ప్రేయర్ హాల్స్, థియేటర్స్, పార్క్స్, జిమ్ లు మే 1 వరకు క్లోజ్ చేయాల్సిందిగా ఆదేశించింది మహారాష్ట్ర ప్రభుత్వం. తాజా మార్గదర్శకాలు బుధవారం రాత్రి 8…
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని అలియా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నీలిరంగు డెనిమ్ చొక్కా, పింక్ ప్యాంటు ధరించిన బ్యూటిఫుల్ పిక్ ను షేర్ చేస్తూ తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపింది అలియా. గత కొన్ని రోజుల క్రితం అలియా భట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో “నాకు కోవిడ్ -19 నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది.…
చిరంజీవి ఆ మధ్య తనకు కరోనా వచ్చిందని, తనను కలిసిన వాళ్ళంతా పరీక్షలు చేయించుకోమని ప్రకటించారు. అయితే… ఎలాంటి అనారోగ్య లక్షణాలు రెండు మూడు రోజులైనా కనిపించకపోవడంతో ఆయన మళ్ళీ మరో రెండు చోట్ల టెస్టులు చేయించుకుంటే కరోనా సోకలేదని తెలిసింది. దాంతో తిరిగి ఈ విషయాన్ని జనానికి సోషల్ మీడియా మీద తెలియచేశారు. తాజాగా ఇలాంటి సంఘటనే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ విషయంలోనూ జరిగింది. సమంత నాయికగా ఆయన దాదాపు ఇరవై రోజులుగా ‘శాకుంతలం’ సినిమాను…
రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. ప్లాట్ ఫామ్ టికెట్లపై భారీగా వడ్డించింది.. కోవిడ్ నిబంధనల పేరుతో అదనంగా రూ. 20 పెంచేసింది రైల్వే శాఖ.. కోవిడ్ నియంత్రణ కోసం రద్దీని తగ్గించడానికి ప్లాట్ ఫాం చార్జీలను పెంచుతున్నామంటూ.. రూ.30 నుంచి రూ.50కి పెంచుతూ ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్ ఓ ప్రకటన చేశారు.. కరోనా వ్యాప్తి వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు ప్లాట్‌ఫాంలకు చేరకుండా నియంత్రించడం కోసమే ఈ నిర్ణయమని ప్రకటనలో పేర్కొన్నారు.…
గతేడాది కరోనా కారణంగా థియేటర్లు బంద్ అయ్యాయి. చిత్రపరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడిపుడే కోలుకుంటోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ కాటువేయబోతోందా? అంటే అవుననే వినిపిస్తోంది. ప్రభుత్వం బంద్ ప్రకటించకున్నా… థియేటర్లు స్వచ్ఛధంగా బంద్ పాటించే పరిస్థితి ఎదురుకాబోతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘వకీల్ సాబ్’ తప్ప వేరే ఏ సినిమా థియేటర్లలో కనిపించటం లేదు. అసలు కరోనా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమ తప్ప వేరే ఏ భాషా సినిమాలకు అంత అశాజనకమైన స్థితి…
భారత్‌ను ఇప్పుడు కరోనా సెకండ్‌వేవ్ కలవర పెడుతోంది.. రికార్డుస్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక, కొత్త కొత్త లక్షణాలు కూడా బయటపడుతున్నాయి.. అయితే, కరోనా ఎలా సోకుతుందన్న దానిపై తాజాగా పరిశోధకులు హెచ్చరించారు.. ఇంటి నుంచి కాలు బయటపెట్టిన మనిషి.. ఎన్నో ప్రాంతాలను తాకుతాడు..! డబ్బులు సైతం చేతులు మారతాయి.. మళ్ళీ అది చేత్తో ఆహారం తీసుకోవడం లేదా చిరుతిండ్లు తినడం, శానిటైజర్ ఉపయోగించకుండా నోరు, ముక్కును ముట్టుకున్నా.. వైరస్ రావడం ఖాయం. మాస్క్ పెట్టుకోకుండా.. చేతులను…
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వం ఒకవైపు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ మరో వైపు రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఎందరో ప్రముఖులు సైతం దీని బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రన్‌బీర్ కపూర్‌కి కూడా కరోనా పాజిటివ్ అని వార్తలు వస్తున్నాయి. అతడితో పాటు అతడి తల్లి నీతు కపూర్‌కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం వీరిద్దరు హోం క్వారంటైన్‌లో ఉన్నారని టాక్ నడుస్తోంది.…
జనవరి 16 వ తేదీ నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తొలివిడతలో ఆరోగ్యకార్యకర్తలకు, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా దేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలివిడతలో మొత్తం మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. కాగా, రెండో విడతలో వృద్దులకు కరోనా వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మార్చి 1 వ తేదీ నుంచి దేశంలోని 60 ఏళ్ళకు…
ప్రపంచదేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు, సేవలు చేసేందుకు కావాల్సిన వైద్యులు, నర్సుల కొరత ప్రపంచదేశాల్లో అధికంగా ఉన్నది. అయితే, ఏ దేశానికీ ఆ దేశం ఇప్పుడు ఈ కొరత లేకుండా చూసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. అక్కడి ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి అధికంగా ఉన్నది. దీంతో వివిధ దేశాల నుంచి నర్సులను రిక్రూట్ చేసుకోవడానికి ఆయా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఫిలిప్పీన్స్…