గత యేడాది డిసెంబర్ 25న విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ తో దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుబ్బు. అతని తల్లి మంగమ్మ కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె కొవిడ్ 19తో పోరాటం చేస్తున్నారు. సరైన వైద్యం సకాలంలో అందకపోవడంతో సుబ్బు సోషల్ మీడియా ద్వారా మాట సాయం చేయమంటూ కోరాడు. ఆ విషయం హీరో సాయి తేజ్ దృష్టికి వెళ్లడంతో ఈ సమస్యను తన ట్విట్టర్ లోనూ పోస్ట్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు మంగమ్మ కరోనా నుండి కోలుకోకుండానే కన్నుమూశారు. ఈ విషయాన్ని సాయితేజ్ దృవీకరిస్తూ, ‘ఆమె ఇక లేరు… సారీ రా సుబ్బు… ఓం శాంతి’ అంటూ తన సంతాపాన్ని తెలిపాడు. సుబ్బులో చక్కని తెలివి తేటలు ఉన్నాయని, అతను ఖచ్చితంగా మంచి దర్శకుల జాబితాలో చేరతాడని ‘సోలో బతుకే సో బెటర్’ మూవీ విడుదల సమయంలో సాయితేజ్ చెప్పాడు. అయితే… ఎంతో కాలం సహాయ దర్శకుడిగా ఉన్న తన కొడుకు సుబ్బు దర్శకుడు కావడమే ఆమె చివరగా పొందిన ఆనందం అని చెప్పాలి.
She’s no more… I’m sorry ra Subbu .. Om Shanti 🙏🏼 https://t.co/uNEFXTVUlf
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 16, 2021