గిరిజనుల సేవలో నటుడు జీవన్ కుమార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కష్టకాలంలో నటుడు జీవన్ కుమార్ నిర్మల్ జిల్లా గండి గోపాల్ పూర్, కట్టకింది గూడం, గండి గూడం, చెరువు కింద గూడంలో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రాంతాలలో నివసిస్తున్న 350 గిరిజన కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, ఇతర నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు, శానిటైజర్స్ అందించాడు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీప్రవీణ్ కుమార్, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సీఐ శ్రీధర్, కడం ఎస్ఐ రాజు, దస్తూరాబాద్ ఎస్ఐ రాహుల్, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జీవన్ కుమార్ చేస్తున్న సహాయక చర్యలను పోలీస్ శాఖవారు ప్రశంసించారు. ఏజెన్సీ ఏరియాలలో జీవన్ చేస్తున్న సహాయం అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సమారిటన్స్ ఫర్ ది నేషన్, ప్రాజెక్ట్ అన్నపూర్ణ, లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్, జీవన్ కుమార్ వారి సౌజన్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వీటి పంపిణీ జరిగింది. ఇప్పటికే పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన జీవన్ కుమార్ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ‘ఏక్ మినీ కథ’లోనూ పోలీస్ అధికారి పాత్రను పోషించాడు.
Also Read
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
తాజావార్తలు
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై!
-
I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
-
Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!