ఏపీలో కరోనా ఉధృతి మళ్లీ మొదలైందా..? అదే కొంపముంచిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా? అంటే కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కేసులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.. సిక్కోలులో పాజిటివిటీ రేటు మళ్లీ పెరుగుతుండటంతో అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటుందనుకుంటున్న వేళ కేసులు పెరగడం శ్రీకాకుళం జిల్లాలో కొత్త కలవరాన్ని పుట్టిస్తోంది. సరిగ్గా 4నెలల క్రితం రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో ఒకటిగా ఉన్న శ్రీకాకుళం.. ఆ తర్వాత కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలతో వైరస్‌ను నిలువరించింది. అయితే, మొన్నటి వరకూ కొనసాగిన సండే లాక్‌డౌన్ కూడా.. ఎత్తేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్టు కనిపిస్తోంది.
ఒక్కోరోజు జిల్లాలో 50 లోపు కేసులు నమోదైతే.. మరో రోజు దాదాపు 100 వరకూ కేసులు నమోదవుతున్నాయి. రూరల్, అర్బన్ అని తేడా లేకుండా రోజుకో ప్రాంతంలో రోజుకో మాదిరిగా పాజిటివిటీ రేటు నమోదవుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో టెస్టులను పెంచి వైరస్ వాహకులను వేగంగా గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కొవిడ్ పంజా విసురుతోంది. ఇంకా జిల్లాలో 2,778 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా.. ఇక్కడ 1800 మంది కరోనాకు బలయ్యారు. జిల్లాలో రోజుకు మూడు వందలకు పైగా కేసులు నమోదవడంతో పాటు.. మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి. తిరుపతి కేంద్రంగా ఎక్కువ నమోదు అవుతున్నాయి. కొన్ని మండలాల్లో ఐదు శాతానికి మించి పాజిటివిటీ రేటు నమోదవడం భయపెడుతోంది. మరో 22 మండలాల్లో సైతం రెండు శాతానికి మించి కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు అధికారులు. నెల రోజుల వ్యవధిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 60 మందికిపైగా పిల్లలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. సైలెంట్ గా కేసులు పెరుగుతున్నా.. రాష్ట్రంలో అత్యధిక మరణాలు జిల్లాలోనే నమోదువుతున్నా… అదే స్ధాయిలో తోంబైశాతం మంది రికవరీ అవుతుండటం ఊరటనిస్తోంది. మునుపటిలా బెడ్లకు డిమాండు లేదు.. కొరత కూడా లేదు. అయితే, తాజాగా నమోదవుతున్న కేసులన్నీ.. ఎక్కువగా గ్రామాల్లోనే వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
తాజావార్తలు
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!