కరోనా మళ్లీ భయపెడుతోంది.దేశంలో పాజిటివ్ కేసులు ప్రకంపం సృష్టిస్తున్నాయి.ఊహించిన దానికి కంటే వైరస్ వేగంగా విస్తరిస్తోంది.చూస్తుండగానే తెలుగురాష్ట్రాల్లోకి ఎంటరైంది.ఏపీలో కడప,విశాఖను తెలంగాణలో కూకట్‌పల్లిని టచ్ చేసింది.కరోనాకు పెద్దగా భయపడాల్సింది లేకపోయినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.మరి లైట్ తీసుకుంటే లైఫ్‌లో రిస్క్‌లో పడినట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే 250కి పైగా యాక్టివ్ కేసులు నమోదవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో వివిధ రాష్ట్రాలు అప్రమత్తం మవుతున్నాయి, వైద్య నిపుణులు ప్రజలను మాస్క్ తిరిగి ధరించాలి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ నటి నికితా దత్తా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేషనల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. నికితా దత్తా తో పాటు ఆమె తల్లికి ఈ మహమ్మారి సోకినట్లు సమాచారం.…
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కూడా మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కోవిడ్ కేసు నమోదైంది. విశాఖలో కోవిడ్ కేసు కలకలం రేపింది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్‌గా రిజల్ట్స్ వచ్చింది.…
విశాఖపట్నంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్‌గా రిజల్ట్స్ వచ్చింది. మహిళను వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. మహిళ ఇంటి చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. Also Read: Coronavirus: కరోనా వైరస్ పట్ల…
మహమ్మారి కరోనా వైరస్‌పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బిగ్ అలెర్ట్ ఇచ్చింది. అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తోంది. తలనొప్పి, జ్వరం, దగ్గు, నీరసం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది. మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడండని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మరలా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. Also Read: Polavaram…
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పుడు దాని ప్రభావం భూమిపైనే కాకుండా చంద్రునిపై కూడా పడింది. లాక్‌డౌన్ కారణంగా అనేక దేశాలలో పరిశ్రమలు మూసివేశారు. రోడ్లపై వాహనాలు కనిపించలేదు. కాలుష్యంలో భారీ తగ్గింపు నమోదైంది. ఈ క్రమంలో.. లాక్డౌన్ ప్రభావం భూమి నుండి చంద్రునికి విస్తరించిందని ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. దీని కారణంగా చంద్రుని ఉష్ణోగ్రత కూడా సాధారణం కంటే తక్కువగా మారింది.
మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 ఒమైక్రాన్ సబ్ వేరియెంట్ కేపీ. 2 యొక్క 91 కేసులను గుర్తించింది. ఇది గతంలో ప్రబలంగా ఉన్న జెఎన్. 1 వేరియంట్ కంటే కాస్త ఎక్కువగా ప్రబలుతోంది. ప్రస్తుతం అనేక దేశాలలో కేసులకు ప్రధాన డ్రైవర్ గా ఈ వేరియంట్ ఉంది. పుణెలో అత్యధికంగా కేపీ. 2 కేసులు 51, థానేలో 20 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర మొదట జనవరిలో కేపీ. 2 కేసులను గుర్తించింది. మార్చి, ఏప్రిల్ నాటికి, ఇది ఈ…
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ సమయం దగ్గర పడుతోంది. జూలై నెలలో ఒలింపిక్స్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. 2024 పారిస్ గేమ్స్ కోసం తాము ‘ఇంటిమసీ బ్యాన్’(సాన్నిహిత్యంగా మెలగడం) ఎత్తేసింది. శనివారం ఒలింపిక్ విలేజ్ డైరెక్టర్ లారెంట్ మిచాడ్ మాట్లాడుతూ.. 2024 గేమ్స్ కోసం బ్యాన్‌ని ఎత్తేస్తున్నట్లు తెలిపారు. 14,250 మంది అథ్లెట్లకు 3 లక్షల కండోమ్స్ అందుబాటో ఉంచినట్లు వెల్లడించారు.
Bird Flu: 2019లో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. తన రూపాన్ని మార్చుకుంటూ అన్ని దేశాల్లో మరణాలకు కారణమైంది. కోవిడ్-19 మిగిల్చిన విషాదాన్ని ఇప్పటికీ ప్రపంచం మరిచిపోలేకపోతోంది. ఇదిలా ఉంటే సమీప భవిష్యత్తులో మరో పాండెమిక్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దానిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు సిద్ధం అవుతున్నాయి.
Mitchell Santner Test Positive for Covid 19: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ప్రస్తుతం సాంట్నర్ బాగానే ఉన్నాడని, సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించినట్లు న్యూజిలాండ్ బోర్డు తెలిపింది. సాంట్నర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, రెండో టీ20 జరిగే హామిల్టన్‌కు ఒంటరిగా వెళతాడు అని పేర్కొంది. కరోనా పాజిటివ్ కారణంగా పాకిస్తాన్‌తో ఈరోజు ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగే తొలి…