దేశంలో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే 250కి పైగా యాక్టివ్ కేసులు నమోదవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో వివిధ రాష్ట్రాలు అప్రమత్తం మవుతున్నాయి, వైద్య నిపుణులు ప్రజలను మాస్క్ తిరిగి ధరించాలి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ నటి నికితా దత్తా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేషనల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. నికితా దత్తా తో పాటు ఆమె తల్లికి ఈ మహమ్మారి సోకినట్లు సమాచారం.
Also Read : Ramakrishna : ఘనంగా ప్రారంభమైన ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ ..
‘కోవిడ్ మా అమ్మగారికి, నాకు హలో చెప్పడానికి వచ్చాడు. ఈ ఆహ్వానించబడిన అతిథి ఎక్కువ సేపు ఉండకూడదు ఆశిస్తున్నాను. ఈ చిన్న క్వారంటైన్ తర్వాత కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ పోస్ట్ చేసింది. అయితే గతంలో నికితా కోవిడ్ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మళ్లీ వైరస్ బారిన పడటంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు ధైర్యం చెబుతూ పోస్టులు చేస్తున్నారు. ఇటివల మహేష్ బాబు మరదలు కూడా కరోనా బారిన పడింది. ఆమె కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కోరింది.