కర్ణాకటపై కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 23,558 కొత్త కేసులను నమోదు అయ్యాయి.. కర్ణాటకలో ఒకేరోజు ఇంత భారీస్థాయిలో కొత్త కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి.. కోవిడ్ బారిన పడి 116 మంది మృతిచెందగా.. ఇదే సమయంలో 6,412 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 12,22,202కు చేరుకోగా.. ఇప్పటి వరకు 13,762 మంది మృతిచెందారు.. 1,76,188 మంది రికవరీ అయ్యారు.. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 15.47 శాతంగా ఉంది.. ఈ రోజు నమోదు అయిన కొత్త కేసుల్లో 13,640 రాజధాని బెంగళూరులోనే నిర్ధారణ కాగా.. 70 మంది అక్కడే మృతిచెందారు. ఇక, కరోనాకు బ్రేక్‌లు వేసేందుకు కర్ణాటకలో రాత్రులు మరియు వారాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.