డేంజర్‌గా మారుతోన్న డెల్టా ప్లస్ వేరియెంట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాతో ఇప్పటికే అల్లాడిపోయిన దేశ ప్రజలను డెల్టా ప్లస్ వేరియంట్.. మరింత భయపెడుతోంది. దేశంలో ఈ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ కారణంగానే మూడో వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది డెల్టా ప్లస్..! ఇప్పుడు ఏకంగా ప్రాణాలను బలి తీసుకుంటోంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొవిడ్ సోకి మే 23న ప్రాణాలు కోల్పోయారు. ఆమె రక్తనమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా.. ఆమెకు డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు గుర్తించారు. ఎంపీలో ఇప్పటివరకు ఐదు కేసులు బయటపడ్డాయి. భోపాల్‌లో మూడు, ఉజ్జయినిలో రెండు కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు వైరస్ నుంచి కోలుకోగా.. ఒకరు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఈ రకం సోకిన వారిని గుర్తించి కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టారు.
ఇప్పటివరకు దేశంలో 40కి పైగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 21 కేసులు బయటపడగా.. మధ్యప్రదేశ్, కేరళ, జమ్మూకశ్మీర్ తదితర రాష్ట్రాలకు ఈ వైరస్ పాకింది. ఆయా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. డెల్టాప్లస్ వ్యాప్తిని అరికట్టేందుకు అడ్వయిజరీ జారీ చేసింది. మరోవైపు.. తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడలేదని ప్రకటించింది రాష్ట్ర వైద్యశాఖ…
Also Read
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?