హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెయిన్ బజార్‌లోని ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులు ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీపావళి పండుగ సందర్భంగా ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో బాణాసంచాను నిల్వ ఉంచారు.
దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడారా.. లేక విభేదాల కారణంగా భార్యను హతమార్చి భర్త ఉరేసుకున్నాడా అన్నది తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతానికి చెందిన చక్రవర్తుల శ్రీధర్(28)కు అదే జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి చెందిన దేవి(24)తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి బాబు (7) పాప(6). ఈ కుటుంబం మూడేళ్ల కిందట రాజమండ్రి వచ్చి ఆనందనగర్ లో ఉంటోంది. శ్రీధర్…