NASA's James Webb Space Telescope Captures Never Before Seen Cosmic Clouds: నాసా ప్రయోగించిన జెమ్స్ వెబ్ టెలిస్కోప్ మరోసారి విశ్వానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాన్ని క్యాప్చర్ చేసింది. ఇప్పటికే విశ్వానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన ఫోటోలను తీసింది. బ్లాక్ హోల్స్, అనేక గెలాక్సీలను, నెబ్యులాలకు సంబంధించిన ఫోటోలను తీసి శాస్త్రవేత్తలనే అబ్బురపరుస్తోంది. తాజాగా జెమ్స్ వెబ్ మునుపెన్నడూ చూడని కాస్మిక్ మేఘాలను చిత్రీకరించింది. నారింజ, నీలిరంగు ధూళికి సంబంధించిన ఫోటోలను తీసింది.