ఇంటర్నెట్ లోనే కాదు బహిరంగ ప్రదేశాల్లోనూ అశ్లీలత పెచ్చుమీరుతోంది. ఆపాల్సిన పోలీసులు దగ్గరుండి అశ్లీల డ్యాన్స్ లు వేయించడం వివాదాలకు దారితీసింది. అమ్యామ్యాలు పుచ్చుకొని చేజర్ల పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామంలో అర్థరాత్రి వేళ చేజర్ల పోలీసుల సాక్షిగా అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. శ్రీ రామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో ఈ అశ్లీల నృత్యాలు రాజ్యమేలాయి. పోలీసులు ప్రభుత్వ ఆంక్షలని సైతం తుంగలో…
రెవిన్యూ శాఖలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అవినితి ఎక్కువగా ఉందని, ఇది అవమానకరంగా ఉందన్నారాయన.. అందుకే అనేక పథకాలను.. లబ్ధిదారులకే నేరుగా ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. అయితే, ఇదే సందర్భంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ధర్మాన.. ప్రజలు నిజాయితీ కలిగిన నాయకులను కోరుకుంటున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ను ప్రజలు నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేసిన ఆయన.. ఇది కేవలం ఆయన నిజాయితీవల్లే సాధ్యమైందన్నారు. ఢిల్లీలో ఆప్…
ఏపీ రాజకీయాలు కాకరేపుతూనే వున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ నేత అశోక్ బాబు ప్రయత్నించడం ఉద్రిక్తతకి దారి తీసింది. ఎమ్మెల్యే స్వామి ఇంటికి కార్యకర్తలతో వెళ్తున్న వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం…
ఉపాధి హమీ పథకం నిధులను పక్కదారి పట్టించారు..కొన్ని చోట్ల రాజకీయ నాయకులు,అధికారులు కలిసి కొంతమెక్కేస్తే మరికొన్నిచోట్ల ఈజీఎస్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి నిధులను మింగేసారు. చనిపోయిన వాళ్లు పనిచేసినట్టు రికార్డ్ చేసారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన అవినీతి ఎంత? ఇందులో ఎవరి పాత్ర ఎంత? రాజకీయ రచ్చకు దారితీస్తున్న ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆదిలాబాద్ జిల్లా జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం నిధులను దిగమింగుతున్నారు. కొన్నిచోట్ల చేయని పనులకు బిల్లులు లేపేస్తే…
అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్టుగా గ్రామ పంచాయతీ నిధులు స్వాహా అవుతున్నాయి. స్వయానా సర్పంచ్, ఉప సర్పంచ్ భర్త లు కుమ్మక్కయ్యారు. వారికి ఓ ప్రజా ప్రతినిధి కూడా మద్దతు ఇవ్వడం, మరో ఉన్నతాధికారి కూడా వారికి వంతపాడడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలసి కోటిన్నర పైగా స్వాహా చేశారు. స్వంత పేర్లతో చెక్కుల ద్వారా డబ్బులు స్వాహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తప్పనిసరి పరిస్థితిలో ఆ ఇద్దరిని సస్పెండ్ చేయాల్సిన…
విజయనగరంలో అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా ? ధరల నియంత్రణతో మంచి పేరు తెచ్చుకున్న అధికారికి…అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయా? వ్యవహారానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగింది. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్. రెవెన్యూ విభాగానికి అధిపతి. జనవరి 2020 లో జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. వచ్చిన తొలినాళ్లలో మంచి పని వాడన్న ముద్ర వేసుకున్నారు. లాక్‌డౌన్‌లో నిత్యావసరాల ధరలను… ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓపెన్ మార్కెట్లను ఏర్పాటు…
నగర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కే మాస్టర్ ప్లాన్ వేశారు అక్కడి అవినీతి అధికారులు. చెప్పింది చేస్తే నాకేంటి..? అని సూటిగా సుత్తిలేకుండా అడిగేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడానికి తమలోని మాటకారితనాన్ని బయటకు తీస్తున్నారు మాయగాళ్లు. ‘మాకేంటి..!?’ అని సిగ్గులేకుండా అడిగేస్తున్నారా? చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతికి ఈ సీన్ అతికినట్టు సరిపోతుంది. మున్సిపల్, చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలోని కొందరు అధికారులకు మాస్టర్‌ప్లాన్ కాసులు కురిపిస్తోంది. ప్లాన్‌పై అభ్యంతరాలు చెప్పే ప్రజలకు చుక్కలు…
అక్కడ నిబంధనలను గాలికి వదిలేశారా? అడ్డగోలు విధానాలతో అక్రమాలకు రాచబాట వేశారా? పక్కా ప్లానింగ్‌తో అవినీతికి పాల్పడుతున్నారా? లోకల్ లీడర్స్ సహకారంతో ఎవరికి తోచిన విధంగా వాళ్లు దండుకుంటున్నారా? ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. లోకల్ లీడర్స్ అండతోనే అక్రమ నిర్మాణాలుఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం.. తిరుపతి. ఇక్కడ భూముల రేట్లు ఆకాశాన్ని తాకితే.. నిర్మాణాలకు భారీ డిమాండ్. ఈ డిమాండే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో కొందరు సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. నగరపాలక…
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఏపీలో రెవిన్యూ అధికారుల అవినీతి జాడలు వెలుగులోకి వస్తున్నాయి. పొదలకూరు పూర్వ తహసీల్దారు స్వాతి అవినీతి పై రెగ్యులర్ విచారణకి ఆదేశించారు ఏసీబీ డైరెక్టర్ జనరల్. ట్రైనీ తహసీల్దారు గా వచ్చి కోట్లాది రూపాయల అవినీతి ,అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు విచారణాధికారులు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన స్వాతి అక్రమాలను విచారించి, అవి నిజమేనని నిగ్గు తేలటంతో ఇప్పటికే ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏసీబీ రెగ్యులర్ విచారణలో మరిన్ని మైండ్…