ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. జగనన్న గోరుముద్ద పథకంలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని పట్టాభి ఆరోపించారు. ఈ పథకంలో 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని.. ఇవేమీ జగన్ తన జేబులో నుంచి తీసి ఇస్తున్న డబ్బులు కావన్నారు. అలాంటి కేంద్ర ప్రభుత్వ నిధులను ఏపీ సర్కారు పక్కదారి పట్టిస్తోందన్నారు. చిక్కీలు సరఫరా చేసే కేంద్ర కంపెనీని దిక్కుమాలిన కారణాలు చెప్పి డిస్ క్వాలిఫై చేశారని పట్టాభి విమర్శించారు.…
ప్రపంచ వ్యాప్తంగా గత పదేళ్లలో అవినీతి నిర్మూలనలో పెద్దగా మార్పు కనిపించలేదని ‘ట్రాన్స్‌పరెన్నీ ఇంటర్నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. కరోనా కట్టడి చర్యల కారణంగా గత రెండేళ్లుగా అవినీతి నియంత్రణ చర్యలకు ఆటంకం కలుగుతోందని సదరు సంస్థ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అవినీతి రహిత (అవినీతి లేకపోవడం) దేశాల ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ 85వ ర్యాంకులో నిలిచింది. దాయాది దేశం పాకిస్థాన్‌లో భారత్‌లో కంటే ఎక్కువ అవినీతి ఉందని సర్వే…
చిత్తూరు జిల్లాలోని కొందరు రెవెన్యూ అధికారుల తీరు హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలోని కొందరు రెవెన్యూ అధికారులపై ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారుల నుంచి VRO, VRAల వరకు ఎవరకు తోచిన విధంగా వాళ్లు దోచేస్తున్నట్టు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నారు. ఏటా నియోజకవర్గంలో పదుల సంఖ్యలో అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కినా మార్పు లేదు. అప్పట్లో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల భరతం పట్టిన ఏసీబీ అధికారులు.. కిందిస్థాయి ఉద్యోగులపై దృష్టి పెట్టలేదన్న…
రోజురోజుకీ అవినీతి పెరిగిపోతూనే ఉంది.. ఏ పని కావాలన్నా మొదట కొంత సమర్పించుకుంటే గానీ పని కాని పరిస్థితి.. ఏ కార్యాలయానికి వెళ్లినా.. అధికారికో.. లేదా మధ్యవర్తికో కొంతైనా ముట్టచెప్పకపోతే.. ఆ ఫైల్ కదలడంలేదంటే అతిశయోక్తి కాదు.. అయితే, ఎప్పటికప్పుడు అవినీతి అధికారులు, ఉద్యోగుల ఆటకట్టిస్తూనే ఉంది అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఈ ఏడాది ముగిస్తున్న నేపథ్యంలో.. 2021 సంవత్సరంలో అవినీతికి సంబంధించిన కేసులపై నివేదిక విడుదల చేసింది ఏసీబీ… ఏసీబీ నివేదిక ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లో…
మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని రేవాలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ… లంచం ఎంత తీసుకోవచ్చు… ఎంత తీసుకోకూడదో మాట్లాడారు. ‘మీ గ్రామ సర్పంచ్ రూ.15 లక్షలు గానీ.. అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే నా వద్దకు రండి. అంతకు తక్కువగా ఉంటే దాని గురించి నాకు చెప్పొద్దు…మీరు కూడా పట్టించుకోవద్దు రూ.15 లక్షలలోపు అవినీతికి పాల్పడితే అతడిని వదిలేయండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ఎందుకు…
ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు కీలకమయిన విధులు నిర్వర్తిస్తూ వుంటారు. వందల కేజీల డ్రగ్స్, బంగారం, ఇతర స్మగ్లింగ్ వస్తువులు పట్టుబడుతూ వుంటాయి. కానీ కొందరు కస్టమ్స్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుడి వద్ద లంచం డిమాండ్ చేసిన కస్టమ్స్ అధికారి ఉదంతం ఇది. లంచం ఇవ్వడానికి నిరాకరించిన ప్రయాణికుడి విషయంలో దారుణంగా ప్రవర్తించాడా అధికారి. లంచం ఇవ్వటానికి నిరాకరించడంతో కక్షకట్టిన కస్టమ్స్ అధికారులు ప్రత్యేక రూమ్ లోకి తీసుకెళ్ళి…
వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు వివిధ రకాలుగా నిరసన తెలుపుతుంటాయి. వరంగల్ జిల్లాలో వినూత్న నిరసన తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇది జరిగింది. జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో అవినీతిపరుడికి సన్మానం పేరుతో ఓవ్యక్తిని గాడిదపై అరగుండుతో ఊరేగిస్తూ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జ్వాల సంస్థ వ్యవస్థాపకుడు సుంకరి ప్రశాంత్, లోక్ సత్తా స్టేట్ కోఆర్డినేటర్ కోదండరామారావు. రోడ్డుపై ఈ నిరసన వైరల్ అయింది. జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో…
లంచానికి అలవాటు పడ్డ అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో రైతు వద్ద 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు విద్యుత్ శాఖ ఏఏఇ రాజ్ కుమార్. మంథని మండలం ఆరెంద గ్రామానికి చెందిన రైతు షౌకత్ అలీ తన పొలానికి మంజూరైన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఏఏఇని కోరాడు. అయితే, అలా చేయడానికి లంచం డిమాండ్ చేశాడు విద్యుత్…
గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్న రీతిలో.. కానిస్టేబుల్‌ను పట్టుకుందామని వచ్చిన ఏసీబీ అధికారులకు ఓ అవినీతి ఎస్సై దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని తుముకూరు గుబ్బిన్ తాలూకాలో పోలీసులు ఓ కేసు నిమిత్తం చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు. అయితే రూ.28 వేలు లంచం తీసుకుని వాహనాన్ని వదిలిపెట్టాలని ఎస్సై సోమశేఖర్.. కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్‌కు సూచించాడు. దీంతో బాధితుడు చంద్రన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కోసం…