Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తూన్నారు. వరుస సినిమాలను లైన్లో పెడుతూ టాలీవుడ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీనితో పాటు యంగ్ హీరో శ్రీ విష్ణుతో కలిసి హసిత్ గోలి దర్శకత్వంలో వీరధీ వీరులు అనే మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
ఇక టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ క్రేజీ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ మార్క్ యూనిక్ మేకింగ్, రవితేజ ఎనర్జీ కలిస్తే థియేటర్లలో ఏ స్థాయిలో రచ్చ ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది . ఈ ప్రాజెక్ట్‌లో రవితేజ సరసన హీరోయిన్గా గ్లామర్ బ్యూటీ డింపుల్ హయాతిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరూ కలసి ఖిలాడి, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలలో కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. కానీ రవితేజ అభిమానులు మాత్రం డింపుల్ వద్దని కోరుతున్నారు. ఈ హీరోయిన్ ఎంపికపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, ప్రస్తుతం నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..