Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- మనీలాలో మార్కో రుబియో సంచలన వ్యాఖ్యలు
- అసలు టార్గెట్ చైనానే? అంటూ విశ్లేషనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం హార్ముజ్ అమెరికా నియంత్రణలోనే ఉంది. ఇరాన్ చేతిలోకి వెళ్లేందుకు ఏ మాత్రం అంగీకరించడం లేదు. అయితే దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది కేవలం ఇరాన్‌ను అడ్డుకోవడానికే కాదని.. దీని వెనుక అసలు లక్ష్యం చైనాకు స్పష్టమైన హెచ్చరిక పంపడమే అని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ (ASEAN) విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ.. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఏకపక్ష నియంత్రణ సాధిస్తే అది ప్రపంచానికి ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుందని హెచ్చరించారు. అదే సమయంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశం కావడానికి ముందు రుబియో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రుబియో ప్రకారం.. అంతర్జాతీయ జలమార్గాలపై ఏ దేశానికీ ఏకపక్ష నియంత్రణ హక్కు లేదని స్పష్టం చేశారు. ‘‘ఒక దేశం అంతర్జాతీయ జలమార్గాన్ని నియంత్రించి, అక్కడ ప్రయాణించే నౌకలపై టోల్ విధించి, చెల్లించకపోతే దాడి చేస్తామని బెదిరిస్తే.. అది ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది అవుతుంది.’’ అని రుబియో వ్యాఖ్యానించారు. ఇది కేవలం మధ్యప్రాచ్య సమస్య కాదని, స్వేచ్ఛాయుత నౌకాయానం అనే అంతర్జాతీయ సూత్రానికి ముప్పు అని పేర్కొన్నారు.
Also Read
- Abdul El-Sayed: అమెరికా సెనెట్లోకి కర్ణాటక అల్లుడు.. ట్రంప్‌కి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది భయ్యా!
- Elon Musk: ఎవడైతే కత్తితో యుద్ధం చేస్తాడో, వాడు కత్తిపోటుకే బలవుతాడు.. మస్క్‌కు మున్ముందు మొసళ్ల పండగే!
- JD Vance: వైట్ హౌస్‌లో అంతర్గత పోరు.. రిపబ్లికన్ పార్టీ ఓటమిపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు..
- Imran Khan: ‘నా భార్యను కాపాడండి.. నా కేసు తర్వాత చూద్దాం’ లాయర్లకు ఇమ్రాన్ ఖాన్ రిక్వెస్ట్!
చైనా ఎందుకు ఈ చర్చలోకి వచ్చింది?
చైనా ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో దాదాపు మొత్తం సముద్ర ప్రాంతంపై హక్కు ఉందని ప్రకటిస్తోంది. ఈ ప్రాంతంపై ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్ కూడా హక్కులు ప్రకటిస్తున్నాయి. 2016లో హేగ్ అంతర్జాతీయ ట్రిబ్యునల్ చైనా వాదనను తిరస్కరించినప్పటికీ.. బీజింగ్ ఇప్పటికీ తన ‘‘నైన్-డ్యాష్ లైన్’’ హక్కును కొనసాగిస్తోంది. అమెరికా మాత్రం తరచుగా Freedom of Navigation Operations (FONOPs) నిర్వహిస్తూ చైనా సముద్ర హక్కులను సవాలు చేస్తోంది. అమెరికా అభిప్రాయం ప్రకారం.. ఒకసారి ఇరాన్ హార్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధిస్తే.. అదే తరహా వాదనను భవిష్యత్తులో చైనా దక్షిణ చైనా సముద్రంలో వినియోగించే అవకాశం ఉంది. అంటే హార్ముజ్‌లో ఇరాన్, దక్షిణ చైనా సముద్రంలో చైనా, తైవాన్ జలసంధిలో బీజింగ్, రెడ్‌సీలో హౌతీలు.. ఇలా వ్యూహాత్మక జలమార్గాలపై ప్రాంతీయ శక్తులు ఆధిపత్యం చెలాయించే ప్రమాదం ఉందని అమెరికా భావిస్తోంది.
ప్రపంచానికి హార్ముజ్ ఎందుకు కీలకం?
అమెరికా ఇంధన సమాచార సంస్థ (EIA) ప్రకారం.. హార్ముజ్ జలసంధి ద్వారా రోజుకు 20.9 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు రవాణా అవుతున్నాయి. ఇది ప్రపంచ సముద్ర మార్గ చమురు రవాణాలో సుమారు 25 శాతం. ఖతార్, యూఏఈ నుంచి భారీ స్థాయిలో ఎల్ఎన్జీ (LNG) కూడా ఇదే మార్గం ద్వారా ఎగుమతి అవుతుంది. దక్షిణ చైనా సముద్రం ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటి. రోజుకు సుమారు 28 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం ఈ మార్గంలో రవాణా అవుతోంది. ప్రపంచ సముద్ర మార్గ చమురు రవాణాలో 37 శాతం ఇక్కడి ద్వారానే జరుగుతోంది. ఏటా 3.4 ట్రిలియన్ డాలర్లకు పైగా వాణిజ్యం ఈ సముద్ర మార్గం గుండా సాగుతోంది. తైవాన్ జలసంధిని అమెరికా అంతర్జాతీయ జలమార్గంగా పరిగణిస్తుండగా.. చైనా మాత్రం దానిపై తన సార్వభౌమ హక్కులు ఉన్నాయని వాదిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలు గణనీయంగా పెరగడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రెడ్సీ ఉదాహరణ
2023 చివరి నుంచి హౌతీ తిరుగుబాటుదారులు రెడ్‌సీలో వాణిజ్య నౌకలపై దాడులు ప్రారంభించడంతో అనేక నౌకలు సూయజ్ కాలువ మార్గాన్ని వదిలి ఆఫ్రికా చుట్టూ ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో ప్రపంచ సరుకు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి.
అమెరికా వ్యూహం ఇదే
అమెరికా వ్యూహం ప్రకారం.. ప్రాంతీయ వివాదాలు లేదా యుద్ధాలు ఏవైనా ఉన్నా అంతర్జాతీయ జలమార్గాలు ఎప్పుడూ వాణిజ్య నౌకలకు స్వేచ్ఛగా అందుబాటులో ఉండాలి. ఒక ప్రాంతంలో ఏకపక్ష నియంత్రణను అంగీకరిస్తే.. అదే వాదనను ఇతర దేశాలు కూడా వినియోగించే ప్రమాదం ఉందని వాషింగ్టన్ భావిస్తోంది. అందుకే హార్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా వ్యతిరేకత కేవలం మధ్యప్రాచ్యానికి మాత్రమే పరిమితం కాకుండా.. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వంటి భవిష్యత్ వ్యూహాత్మక సవాళ్లను దృష్టిలో పెట్టుకున్న ప్రపంచ వ్యూహంలో భాగంగా విశ్లేషకులు చూస్తున్నారు.
- Tags
- china
- Hormuz Strait
- Marco Rubio
- us
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
-
Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
-
Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
-
Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి రజనీకాంత్ మాస్ తాండవం.. ‘జైలర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!