MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- సౌర రంగంలో ధోనీ భారీ అడుగు..
- కొత్త స్టార్టప్‌లో పెట్టుబడి, బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్‌కే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తన ప్రభావాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఇప్పటికే పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టిన ధోనీ.. తాజాగా రూఫ్‌టాప్ సోలార్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న SolarSquare అనే స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టారు. తన ఫ్యామిలీ ఆఫీస్ Midas Deals ద్వారా ఈ పెట్టుబడి పెట్టిన ధోనీ, అదే సమయంలో ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించనున్నారు. అయితే కంపెనీలో ఆయన పెట్టుబడి మొత్తం ఎంత అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఈ పెట్టుబడి ఇటీవల SolarSquare సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన 53 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.510 కోట్లు) విలువైన Series C Funding లో భాగం. ఈ ఫండింగ్ రౌండ్‌కు ప్రముఖ ఇన్వెస్టర్ Lightspeed నాయకత్వం వహించగా, Lowercarbon Capital, Rainmatter, Good Capital వంటి సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి. భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్ భవిష్యత్తుపై తమకు ఉన్న నమ్మకానికి ధోనీ భాగస్వామ్యం నిదర్శనమని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త నిధులతో SolarSquare తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పింది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న నగరాలకు తోడు, మరో 30 నుంచి 40 కొత్త నగరాల్లోకి విస్తరించాలని కంపెనీ వ్యూహాలను రూపొందించింది. అలాగే టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను మరింత బలోపేతం చేయడం, వినియోగదారులకు సులభమైన ఫైనాన్సింగ్ సదుపాయాలు కల్పించడం, కస్టమర్ సపోర్ట్‌ను మెరుగుపరచడం, కొత్త ఉద్యోగులను నియమించడం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టనున్నట్లు చెబుతుంది.
Also Read
- Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
2015లో శ్రేయా మిశ్రా, నీరజ్ జైన్, నిఖిల్ నహర్ కలిసి స్థాపించిన SolarSquare తొలుత వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు సేవలు అందించింది. అనంతరం 2021లో గృహ వినియోగదారుల కోసం రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సంస్థ కన్సల్టేషన్ నుంచి డిజైన్, ఇన్స్టాలేషన్, ఫైనాన్సింగ్, నిర్వహణ వరకు పూర్తి స్థాయి సేవలను అందిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని 29 నగరాల్లో 50,000కుపైగా ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. అలాగే ఇప్పటి వరకు 100 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు సమీకరించగా, సంస్థ వార్షిక ఆదాయ రన్‌రేట్ (ARR) దాదాపు రూ.1,000 కోట్లకు చేరుకుంది. భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు, ప్రభుత్వ సబ్సిడీలు, స్వచ్ఛమైన ఇంధనంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన ఈ రంగానికి ఊతమిస్తున్నాయని విశ్లేషకలు. దేశంలోని సుమారు 7 కోట్ల ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని SolarSquare అంచనా వేస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 2030 నాటికి భారత క్లీన్టెక్ మార్కెట్ 152 బిలియన్ డాలర్ల అవకాశంగా మారే ఛాన్స్ ఉంది. కాగా 2026లో ధోనీ పెట్టిన మూడో స్టార్టప్ పెట్టుబడి ఇదే కావడం విశేషం. అంతకుముందు ఆయన Kuku, LightFury Games వంటి స్టార్టప్‌లలో కూడా పెట్టుబడులు పెట్టారు. ఇటీవల రోహిత్ శర్మ, అజింక్య రహానే, రియాన్ పరాగ్ వంటి భారత క్రికెటర్లు కూడా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార రంగంలో తమ ముద్ర వేస్తున్నారు.
తాజావార్తలు
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!