Gabbar Singh Ramesh: గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ ద్వారా గుర్తింపు పొందిన నటుడు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియడంతో టాలీవుడ్ వర్గాలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల రమేష్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయన్ను అత్యవసర వైద్య విభాగంలో (ICU) ఉంచి చికిత్స అందిస్తున్నారు. రమేష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందనీ, ఆయన కోలుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నామని అపోలో వైద్య వర్గాలు వెల్లడించాయి.
హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన పోలీస్ స్టేషన్ కామెడీ గ్యాంగ్‌లో రమేష్ ఒకరిగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమాలో తనదైన శైలిలో నటనతో అందరి దృష్టిని ఆకర్షించి ‘గబ్బర్ సింగ్ రమేష్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆ గుర్తింపుతో ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. ఇక హఠాత్తుగా ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై చావుబతుకుల మధ్య పోరాడుతుండటంతో చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటులు, సాంకేతిక నిపుణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రమేష్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.
Also Read
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?