కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నది. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పట్టిన మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులో కొత్త రూపంలో పెరుగుతున్నాయి. మళ్లీ లాక్‌డౌన్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు వాడకం పెరుగుతున్నది. అయితే, శరీరంపైన, దుస్తులపైనా ఉండే కరోనా మహమ్మారిని అంతం చేసే యంత్రాలపై పరిశోధకులు దృష్టిసారించారు. పాట్నా ఐఐటీకి చెందిన పరిశోధకులు ఫుల్ బాడీ డిసిన్ఫెక్ట్ యంత్రాన్ని తయారు చేశారు. ఈ ఫుల్ బాడీ డిసిన్ఫెక్ట్ యంత్రం ఏర్పాటు చేసిన ద్వారం గుండా లోనికి వెళ్లే శరీరంపై ఉండే కరోనా వైరస్ అంతం అవుతంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదించిన ద్రావణాన్ని ఈ యంత్రం ద్వారా పిచికారి చేస్తారు. ఈ ద్రావణం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవని పాట్నా పరిశోధకులు చెబుతున్నారు.
Read: ప్లాస్టిక్ రాయి అనుకొని పారేద్దామనుకుంది… వజ్రం అని తెలిసి…