Covid Update: చైనాతో పాటు కొన్ని ఆసియా దేశాల్లో కోవిడ్ కేసులు పెరగుతున్నాయి. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్.7తో చైనా అల్లాడుతోంది. అక్కడి రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.దేశంలోని అన్ని ప్రాంతాాల్లో ఆస్పత్రులు కోవిడ్ రోగులతో నిండిపోయాయి. ఈ నెలలో చైనాలో కోవిడ్ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Zero Covid Cases: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలోనే అనేక దేశాలు తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి.
Corona BF7: కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి కరోనా విజృంభిస్తున్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది.
Chinese turning to Indian drugs on black market amid Covid spike: చైనాలో కోవిడ్-19 విలయతాండవం సృష్టిస్తోంది. ఆ దేశంలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. దేశంలోని అన్ని ఆస్పత్రులు కోవిడ్ రోగులతో నిండిపోయాయి. దీంతో పాటు చాలా చోట్ల మందుల కొరత వేధిస్తోంది. దీంతో చైనీయులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ మెడిసిన్స్ కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు.…
4 Foreigners Test Covid Positive At Bihar's Gaya Airport, Isolated: చైనాలో కోవిడ్ కొత్తవేరియంట్ బీఎఫ్-7 విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. జీరో కోవిడ్ పాలసీ ఎత్తేసిన తర్వాత అక్కడ కోవిడ్ దారుణంగా వ్యాపిస్తోంది. బీజింగ్, షాంఘై పాటు ఇతర నగరాల్లో కూడా కోవిడ్ కేసులుతో ఆస్పత్రులు నిండిపోయాయి. అక్కడ రానున్న రోజుల్లో మూడు కోవిడ్ వేవ్ లు వస్తాయని పరిశోధకులు అంచానా వేస్తున్నారు. గడిచిన 20 రోజుల్లోనే…
Central Government: నూతన సంవత్సరం కానుకగా దేశంలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఏడాది పాటు ఉచితంగా రేషన్ అందించాలని నిర్ణయించింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని 81.5 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని, వారికి ఏడాది పొడవునా ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తామని తెలిపింది. కరోనా లాక్ డౌన్ సమయం నుంచి కేంద్రంలోని బీజేపీ…
India ready to export fever drugs to China amid COVID surge: ప్రపంచంలో అతిపెద్ద డ్రగ్ మేకర్ అయిన ఇండియా, చైనాకు జ్వరం మందులు పంపేందుకు సిద్దం అవుతోంది. కోవిడ్-19 వల్ల చైనా తీవ్రంగా దెబ్బతింటోంది. అక్కడ రోజుకు కొన్ని లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో చైనాకు ఫీవర్ మెడిసిన్స్ ఎగుమతులను పెంచేందుకు సిద్ధంగా ఉందని భారత ఔషధ ఎగుమతి సంఘం చైర్పర్సన్ గురువారం తెలిపారు.