Zero Covid Cases: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలోనే అనేక దేశాలు తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంకా పలు దేశాలు ఆంక్షల వలయంలోనే కొనసాగుతున్నాయి. అయితే, ప్రపంచంలో కరోనా వైరస్ కేసు ఒక్కటి కూడా లేని దేశాలు కూడా ఉండటం గమనార్హం. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆ దేశాల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు రెండు దేశాలు కరోనా సున్నా కేసులను కలిగి ఉన్నాయి. ఈ దేశాలు, తుర్క్‌మెనిస్తాన్, ఉత్తరకొరియా.
Read Also: Japan Dog Man: కుక్క బతుకు బాగుంటుంది అనుకుంటే.. నిజంగానే కుక్క బతుకైంది
పక్కనే ఉన్న చైనాలో కరోనా వ్యాప్తి జరుగుతోందని తెలియగానే ఉత్తర కొరియా సరిహద్దులు పూర్తిగా మూసేసి కరోనా తమ దేశంలో ప్రవేశించకుండా జాగ్రత్త పడింది. తుర్క్ మెనిస్థాన్ విషయానికొస్తే ఆరంభంలోనే చైనాకు విమానాలు రద్దు చేసింది. అన్ని దేశాలతో ఉన్న సరిహద్దులు మూసేసి తన ప్రజలను రక్షించుకుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పసిఫిక్ ద్వీప దేశాల గురించే. విదేశాల నుంచి వచ్చేవారికి ఈ దేశాలు కఠిన నిబంధనలు అమలు చేశాయి. కచ్చితంగా 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకోవడం, ఆపై డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి వంటి నిబంధనలతో కరోనాను ఆమడదూరం పెట్టాయి. ప్రధానంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేయడం ఈ దేశాలను వైరస్ కు దూరంగా నిలిపింది. ఈ పసిఫిక్ ద్వీపదేశాల్లో జనాభా తక్కువగా ఉండడం కూడా అక్కడి ప్రభుత్వాలకు సేవలు అందించేందుకు సులువుగా మారింది.