JN.1 Cases: దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య పెరగుతోంది. ఇదిలా ఉంటే కోవిడ్ సబ్ వేరియంట్ JN.1 కేసుల్లో పెరుగుదల కూడా కలవరపరుస్తోంది. ఇన్సాకాగ్(INSACOG) డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 263 JN.1 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో సగం కేరళలోనే నమోదయ్యాయి.
పెరుగుతున్న కొవిడ్-19 కేసులను చూస్తుంటే, పండుగల సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొవిడ్ కొత్త రూపాంతరం, JN.1 కారణంగా ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. అంతే కాకుండా చలికాలంలో ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. ఈ కారణాల వల్ల పండుగల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
WHO: పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆగ్నేయాసియా ప్రాంత దేశాలకు నిఘా పెంచాలని విజ్ఞప్తి చేసింది. కోవిడ్ 19, దాని కొత్త ఉప-వ్యాధి వేరియంట్ JN.1, ఇన్ఫ్లుఎంజాతో సహా శ్వాసకోశ వ్యాధుల కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా నివారణ చర్యలు తీసుకోవాలని WHO ప్రజలను కోరింది.
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 656 కొత్త కొవిడ్ కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. కేరళ, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
JN.1 Corona variant: దేశంలో కొత్త కోవిడ్-19 వేరియంట్ JN.1 కలవరపరుస్తోంది. ఇప్పటి వరకు దేశంలో కొత్త వేరియంట్ కేసులు 22 నమోదయ్యాయి. ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల్లోనే వెలుగులోకి వచ్చాయి. గోవాలో 21 కేసులు, కేరళలో ఒక కేసు నమోదైంది. అయితే JN.1 సోకిన వారంతా ఎలాంటి సమస్యలే లేకుండా కోలుకోవడం ఒకింత సంతోషకరమైన విషయం.
కొవిడ్ కొత్త వేరియంట్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో సమీక్షించారు. జేఎన్–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు.
New Covid Variant: కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 మరోసారి ప్రజల్ని భయపెడుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 358 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కేరళలోనే 300 కేసులు ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం 2669 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే JN.1 వేరియంట్ పెద్దగా ప్రమాదాన్ని కలిగించని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ దీనికి వేగం వ్యాప్తించే గుణం ఉందని హెచ్చరించారు.
కరోనా పేరు మళ్లీ జనాల్లో వినిపిస్తుంది.. గత రెండేళ్లుగా ఊపిరి పీల్చుకున్న జనాలు ఇప్పుడు కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భయ బ్రాంతులకు గురవుతున్నారు.. కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది.. ఈ వైరస్ వ్యాప్తి పై ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే 21 కొత్త కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.. మరోవైపు…
భారత్ లో కరోనా వైరల్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా యొక్క కొత్త వేరియంట్ జెన్.1తో ప్రజలలో భయాందోళన సృష్టించింది. ఇదిలా ఉండగా.. రోజు రోజుకి కోవిడ్ వైరస్ ఇన్‌ఫెక్షన్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఇవాళ రాష్ట్రాలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోంది. తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్రంలో 402 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. నాలుగు కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.