JN.1గా గుర్తించబడిన కొత్త కొవిడ్-19 వేరియంట్ భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ నిపుణులు, అధికారులు, సాధారణ ప్రజలలో భయాందోళనను కలిగిస్తోంది. JN.1 కోవిడ్ సబ్‌వేరియంట్ మొదటగా లక్సెంబర్గ్‌లో గుర్తించబడింది. ఇది పిరోలా వేరియంట్ (BA.2.86) వారసుడిగా పరిగణించబడుతోంది. దీని మూలాలు ఒమిక్రాన్ సబ్-వేరియంట్‌లో ఉన్నాయి.
COVID subvariant JN.1: దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనపిస్తోంది. తాజాగా కేరళలో కొత్తగా కోవిడ్ సబ్‌వేరియంట్ వెలుగులోకి వచ్చింది. JN.1 సబ్‌వేరియంట్‌ని కనుగొన్నారు. చైనాలో కేసులకు కారణమవుతున్న ఈ వేరియంట్‌ని తొలిసారిగా కేరళలో గుర్తించారు. JN.1 సబ్‌వేరియంట్, BA.2.86 వేరియంట్‌గా కూడా పిలుస్తారు. మొదటిసారిగా సెప్టెంబర్ 2023లో అమెరికాలతో ఇది కనుగొనబడింది.
2020ని ప్రపంచం ఎప్పటికీ మరవదు. అనూహ్యంగా మనమధ్యకు వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ వైరస్ పుట్టుక, మనుగడ తెలుసుకునేలోపే లక్షల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వ్యాక్సినేషన్లు రావడంతో కరోనా నుంచి ఉపశమనం లభించింది. క్రమంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ పూర్తిగా మాత్రం పోలేదు. ఇంకా మహమ్మారి మన మధ్యే ఉంది. రీసెంట్‌గా మరోసారి ఈ మహమ్మారి మరోసారి బయటకు వచ్చింది. యూకేలో మార్పు పొంది కొత్త వెరియంట్‌తో విజఈంభించేసుందుకు రెడీగా ఉంది.…
Covid-19 Vaccine: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచదేశాలను కలవరపెట్టింది. చైనాలో ప్రారంభమైన ఈ కరోనా వైరస్ అనతికాలంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. లక్షల్లో ప్రజలు మరణించారు. రూపాలను మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై దాడి చేసింది. చైనాతో పాటు అమెరికా, ఇటలీ, భారత్ వంటి దేశాల్లో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి. దీన్ని అంతం చేయడానికి ప్రపంచంలోని పలు దేశాలు వ్యాక్సిన్లను తయారుచేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుంచి ప్రపంచదేశాలు కోలుకుంటున్నాయి.
కరోనా సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. మూడేళ్ల క్రితం వెలుగు చూసిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. కరోనా భయాల నుంచి అందరూ బయటపడిన నేపథ్యంలో మళ్లీ కరోనా అని పేరు వినిపిస్తుండడంతో భయాందోళన కలుగుతోంది.
కరోనా వైరస్.. రెండేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించింది. లక్షల్లో ప్రాణాలను బలి తీసుకున్న ఈ వైరస్ కొత్త రూపం దాల్చి మళ్లీ విజృంభించేందుకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఓమిక్రాన్ వెరియంట్ ఉత్పవరివరతనమైన బీఏ 2.86 లేదా పిరోలా రూపంలో కోవిడ్ 19 బ్రిటన్‌లో వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని ప్రభావం భారత్‌పై కూడా పడనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కొత్త వెరియంట్ వల్ల తీవ్ర స్థాయిలో ప్రమాదం ఉండకపోవచ్చు కానీ.. ఈ వ్యాధి లక్షణాలతో ప్రజలు…
Covid-19: సింగపూర్‌లో ఇటీవల కాలంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ మరో కోవిడ్ వేవ్ ని ఎదుర్కొంటోందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ శుక్రవారం హెచ్చరించారు.
కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ నివారణ కోసం ఒమిక్రాన్ ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత బూస్టర్ వ్యాక్సిన్‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం ప్రారంభించారు. జెమ్ కొవాక్ ఒమ్(GEMCOVAC-OM) అనేది భారత దేశానికి చెందిన మొట్టమొదటి ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్.
Long Covid-19: కోవిడ్ 19 వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చైనాలోని వూహాన్ నగరంలో 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్, అనతికాలంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. దీని వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా తన రూపాలను మార్చుకుంటూ, వివిధ వేరియంట్ల రూపంలో మనుషులపై అటాక్ చేసింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో కోవిడ్ సంక్రమిస్తూనే ఉంది.