HMPV Virus: కోవిడ్-19 తొలి కేసు నమోదై ఇటీవలే 5 ఏళ్లు గడిచాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఎంతటి దుర్భర పరిస్థితి అనుభవించిందో అందరికి తెలుసు. అయితే, తాజాగా మరో కొత్త వైరస్ ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ చైనాలో విజృంభిస్తోంది. కోవిడ్, ఫ్లూ లక్షణాలు కలిగిన ఈ వ్యాధి కారణంగా చాలా మంది ప్రజలు ఆస్పత్రుల్లో చేరిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా పరిణామాలు మరో కోవిడ్-19కి దారి తీస్తుందా అనే భయాలు ప్రపంచదేశాల్లో వ్యాపిస్తున్నాయి. కొన్ని సోర్సెస్ ప్రకారం.. వ్యాప్తి కారణంగా చైనా అత్యవసర పరిస్థితి ప్రకటించిందనే వార్తలు వస్తున్నాయి.
HMPV వైరస్ అంటే ఏమిటి?
మనకు తెలిసిన సమాచారం ప్రకారం.. చైనా అధికారులు తెలియని ఒక న్యూమోనియా కేసులు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. దీనిని నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించారు. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయని భావిస్తున్నారు. డిసెంబర్ 16 -22 మధ్య శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరిగినట్లు డేటా షేర్ చేశారు. చైనా ఆరోగ్య అధికారులు.. దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుందని ధ్రువీకరించారు. ఉత్తర ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైనట్లు తెలిపారు.
Read Also: HMPV Virus: చైనాలో విస్తరిస్తున్న వైరస్ కారణంగా మనం దేనికి భయపడాలి.. లాక్‌డౌన్ తప్పదా..?
లక్షణాలు:
దగ్గు, జ్వరం, గొంతునొప్పి, కొంతమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక, ఛాతి నొప్పులు. కొన్ని లక్షణాలు శిశువులు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. న్యూమోనియా లేదా బ్రోంకైటిస్ వ్యాధి లక్షణాలకు దారి తీయవచ్చు.
ఎవరికి వచ్చే ప్రమాదం ఉంది..?
హ్యుమన్ మెటాన్యూమోవైరస్(HMPV) అనేది శ్వాసకోశ వైరస్ అని వైద్యులు చెబుతున్నారు. ఇది చిన్న పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వారిని అటాక్ చేస్తుంది. దగ్గు, తమ్ములు, కలుషిత పరిసరాల కారణంగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.
ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్(COPD) వంటి శ్వాస కోశ సంబంధ డబ్బులు ఉన్నవారు ఈ వైరల్ వల్ల ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తు్న్నారు.
భారతీయులపై ప్రభావం:
ప్రస్తుతం కొత్త వైరస్ కేసులు చైనాలో మాత్రమే నివేదించబడ్డాయి. భారత్ లేదా ఇతర ప్రాంతాల్లో ఈ కేసులు కనుగొనబడలేదు.