కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు వైద్య నిపుణులు.. దీంతో.. అంతా వ్యాక్సినేషన్‌పై పడిపోయారు.. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్లతో పాటు.. రాష్ట్రాలు కూడా గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లు కొనుగోలుచేస్తున్న సంగతి తెలిసిందే… ఇక, ఏపీ ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది.. 11,45, 540 కోవిషీల్డ్ డోసులకు గాను రూ.36,08,45,100 చెల్లించింది.. కోవిషీల్డ్ ఒక డోస్ ధర రూ 300 కాగా.. దానికి 5 శాతం ట్యాక్స్ కలుపుకుని రూ.315గా అవుతుంది.. ఇక,…
కరోనా పెను సవాల్‌గా మారింది.. దానిపై జరిపే పోరాటంలో విజయం సాధించడానికి ఉమ్మడి వ్యూహం, ప్రయత్నం అవసరం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కరోనా పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ రాష్ట్ర, జిల్లా అధికారులతో మాట్లాడారు.. కోవిడ్ పై చేసిన యుద్ధంలో మోడీ నాయకత్వానికి ఈ సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు అధికారులు.. ఆయా జిల్లాల్లో కరోనా పరిస్థితి మెరుగుపడటం గురించి ప్రధానికి వివరించారు.. రియల్ టైమ్ పర్యవేక్షణ, సామర్థ్యం పెంపు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్న…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరికొన్ని కరోనా టీకా డోసులు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో 50 వేల కొవాగ్జిన్ టీకా డోసులు చేరాయి. అయితే రాష్ట్రానికి కొత్తగా చేరిన 76 వేల కొవిషీల్డ్, 50 వేల కొవాగ్జిన్ టీకాలతో వ్యాక్సిన్ కొరతకు కొంత ఉపశమనం లభించింది. ఈ టీకాలను వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో ఆయా జిల్లాలకు తరలించనునారు అధికారులు. మరికొన్ని టీకా డోసులు రాష్ట్రానికి చేరుకొనే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. అయితే ఏపీలో కరోనా…
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విరాట్ వీలైనంత త్వరగా ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపాడు. అయితే కట్టు దిట్టమైన బయో బాబుల్ జరుగుతున్న ఐపీఎల్ 2021 లోకి కరోనా రావడంతో నిరవధికంగా టోర్నీ వాయిదా పడింది. ఈ క్రమంలోనే బీసీసీఐ సూచన మేరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు విరాట్ కోహ్లీ…
కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యాక్సిన్ ఇస్తే కేవలం 10 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసే సామర్థ్యం మన యంత్రాంగానికి ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రపంచమే కరోనా పై యుద్ధం చేస్తోంది.. ఇంత భయంకర పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కొందరు విమర్శలు చేయటం దుర్మార్గం అంటూ మండిపడ్డారు.. రికవరీలో జాతీయ సగటు 88.5 శాతంగా ఉంటే రాష్ట్రంలో 93.50 శాతం ఉందని.. విమర్శించే వాళ్లు దీనిని ఎందుకు చెప్పడం…
రాష్ట్రాలకు ఉపశమనం కలిగిస్తూ నిన్న సీరం.. తన వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధరలు తగ్గించగా.. ఇప్పుడు.. భారత్ బయోటెక్ సంస్థ కూడా గుడ్ న్యూస్ చెప్పింది.. రాష్ర్టాలకు అందించే కొవాగ్జిన్ ధరలను తగ్గించింది.. కొవాగ్జిన్ ఒక్క డోసును రూ. 400కే సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. కాగా, గతంలో ఒక్క డోసును రూ. 600గా నిర్ధారించిన భారత్ బయోటెక్.. ఇప్పుడు ఏకంగా ఒక్క డోసుపై రూ. 200కు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, కోవిషీల్డ్ టీకా ధరను సీరం…
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మొదట రెండు వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భారత ప్రభుత్వం.. ప్రస్తుతం.. దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నారు.. అయితే, కోవాగ్జిన్ సమర్థతపై కీలక ప్రకటన చేసింది ఐసీఎంఆర్.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది.. కొత్త వేరియంట్లను కూడా లోకల్ టీకా సమర్థవంతంగా అడ్డుకుంటుందని తెలిపింది.. భారత వైద్య పరిశోధన మండలి.. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌పై కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని, సార్స్-కోవ్-2కు…
ప్రస్తుతం 45 ఏళ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. మే 1వ తేదీ 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది.. అయితే, 45 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ టీకా ఉచితమే అయినా.. 18 ఏళ్ల పైబడిన వారి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు కేంద్రం.. అంటే.. ఆ భారాన్ని.. వినియోగదారులు లేదా.. రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మే 1వ తేదీ నుంచి 18…
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి భయానకంగా మారింది. రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఇంకా భయం వెంటాడుతూనే ఉన్నది. పైగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరత ఇబ్బందులు పెడుతున్నది. పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ అందించాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తగినన్ని వ్యాక్సిన్ సరఫరా కాకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ నిర్వహించినా వ్యాక్సిన్ లేమి కారణంగా అరకొరగా మాత్రమే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. వ్యాక్సిన్ కొరతకు…
మాయదారి మహమ్మారి కరోనాకు చెక్ పెట్టడానికి ఉన్న ఒకే ఒక మర్గం వ్యాక్సినేషన్.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ఆగిపోయే పరిస్థితి నెలకొంది.. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఉన్న మొత్తం వ్యాక్సినేషన్‌ను పంపిణీ చేశారు వైద్య సిబ్బంది.. దీంతో.. కేంద్రం వ్యాక్సిన్ డోసులు పంపేవరకు వేచిచూడాల్సిన పరిస్థతి. ఇటీవలే కేంద్రం నుంచి వచ్చిన 6 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు సిబ్బంది.. దీంతో.. ఏపీలో జీరోకు పడిపోయాయి వ్యాక్సిన్ నిల్వలు.. మరోవైపు.. మరిన్ని డోసులు కావాలంటూ…