కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రకరకాల వేరియంట్లు పుట్టుకురావడంతో వాటికి తగినట్టుగా వ్యాక్సిన్లు రెడీగా లేకపోవడంతో మహమ్మారి బారిన పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం ప్రపంచంలో సీ 1.2 వేరియంట్ ప్రభలంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ మిగతావాటికంటే బలంగా ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, కరోనా నుంచి బయటపడాలి అంటే ప్రస్తుతానికి వ్యాక్సిన్ తీసుకోవడం, నిబందనలు పాటించడం ఒక్కటే మార్గం కావడంలో జాగ్రతగా ఉండాలని హెచ్చిరిస్తున్నారు. ఇక ఇదిలా…
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్నారు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్. గిరిజనులలో కోవిడ్ వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచడానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సోమవారం రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం లోని కె సి తండా లో గిరిజనుల తో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల గిరిజనులలో ఉన్న అపోహలు తొలగించడం, వారిలో 100% వ్యాక్సినేషన్ సాధించడం లక్ష్యాలుగా గవర్నర్ గిరిజన తండా లో వారితో పాటు టీకా తీసుకుంటారు. గిరిజనులకు…
కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు భారత్ బయోటెక్ ఫార్మాసంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్‌కు ఇప్పటికే భారత్‌లో అనుమతులు లభించాయి. వేగంగా వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, యూరోపియన్ దేశాలు కోవాగ్జిన్‌ను వ్యాక్సిన్‌గా గుర్తించకపోవడంతో అక్కడి దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయలేకపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే, భారత్ వ్యాక్సిన్‌పై ఉన్న నమ్మకంతో బ్రెజిల్ కోవాగ్జిన్ ను కోనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. 20 కోట్ల…
ఏపీకి మరో 9 లక్షల కొవిడ్ టీకా డోసులు తరలివచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి కొవిషీల్డ్ టీకా డోసులు. దిల్లీ నుంచి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 75 బాక్సుల్లో టీకా డోసులు రాష్ట్రానికి తరలివచ్చాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ ను తరలించారు అధికారులు.. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్లనుంది వ్యాక్సిన్.. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్…
ఇండియాలో ఇప్పటి వరకు 25.90 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదట్లో అనేక దుష్ప్రభాలు కనిపించాయి. కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్నాక మరణించారు కూడా. అయితే, వ్యాక్సిన్ వికటించడం వలన మరణించినట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించలేదు. ఇక ఇదిలా ఉంటే, కేంద్రం మొదటిసారి తొలి వ్యాక్సిన్ మరణాన్ని దృవీకరించింది. మార్చి 8వ తేదీన 68 ఏళ్ల వృద్దుడు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక మరణించిన 31 మందిలో…
కరోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే భారత్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల ధరలను కేంద్రం ప్రకటించింది.. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి ధరలను ఖరారు చేసింది.. అయితే, ఇవి ప్రైవేట్ ఆస్పత్రుల్లో తీసుకునేవారికి మాత్రమే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.. ఇక, వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కొత్త వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది కేంద్రం… త్వరలో బయోలాజికల్-ఈ నుంచి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది… ఇప్పటి…
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోను ఆ పార్టీ ట్విట్టర్‌లో పెట్టి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై యూపీ బీజేపీ విభాగం స్పందించింది. చాలా మంచి విషయం చెప్పారనీ, గతంలో అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ బీజేపీ వ్యాక్సిన్‌గా పేర్కొంటూ విమర్శలు చేశారని, కానీ, ఇప్పుడు అదే వ్యాక్సిన్‌ను ములాయం సింగ్ తీసుకున్నారని, త్వరలోనే అఖిలేష్ యాదవ్ తో పాటుగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వ్యాక్సిన్ తీసుకుంటారని…
ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు స్పుత్నిక్ వ్యాక్సిన్ చేరుకుంది. రష్యా నుండి ప్రత్యేక విమానంలో వచ్చిన 56.6 టన్నుల స్పుత్నిక్ వ్యాక్సిన్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కార్గో లో దిగుమతి అయింది. వ్యాక్సిన్ రష్యా నుండి ప్రత్యేక ఛార్టర్డ్ ఫైట్ ( RU-9459) లో హైదరాబాద్…
తెలంగాణలో వ్యాక్సిన్ ల చోరీ కలకలం రేపుతోంది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 500 కోవిషిల్డ్ డోసులు మాయం అయ్యాయి. ఈ ఘటనలో ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఆసుపత్రి సిబ్బంది, అధికారులు. అయితే ఈ కోవిషిల్డ్ డోసులు మాయమైన రోజు నుంచి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా కనిపించడం లేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు ఆసుపత్రి సూపరిండెంట్. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తెలంగాణలో…