ఆనందయ్య ఆయుర్వేద మందు పై కేంద్ర ఆయుష్ సంస్థ తో కలిసి టీటీడీ ఆయుర్వేదిక్ కళాశాల అధ్యయనం చేస్తోంది అని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తాజాగా ఎన్టీవీతో టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ… ఆనందయ్య ఆయుర్వేద మందు తీసుకున్న 500 మందిని స్టడీ చేసే ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. ఐసీఎమ్మార్ దీనిలో చేయగలిగింది ఏమీ లేదు. కేంద్ర ఆయుష్ శాఖే నిర్ధారించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతుల తర్వాతే మందు విషయంలో ముందుకు వెళ్ళాలని…
కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు.. ఎంతోమంది కరోనా రోగులను నయం చేసింది.. దీంతో.. క్రమంగా అటు పరుగులు పెట్టారు జనం.. అయితే, ఎప్పుడైతే.. దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం మొదలైందో.. అప్పటి నుంచి మందు పంపిణీ నిలిచిపోయింది.. ఇక, ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ పరిశోధన చేస్తున్న విషయం తెలిసిందే కాగా.. ఆయుష్ కమిషనర్ రాములు… ఇవాళ ఆనందయ్య మందుపై నివేదికను ఏపీ సీఎం వైఎస్…
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం పనితీరుపై పరిశోధన ప్రారంభించింది జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ. మొదటి దశలో ముందు తీసుకున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న సీసీఆర్ఏఎస్… విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన స్థానం, తిరుపతి ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రికి బాధ్యతలు అప్పగించింది సీసీఆర్ఏఎస్. నెల్లూరు జిల్లా ఎస్పీ సహకారంతో మందు తీసుకున్న 500 మంది వివరాలు సేకరించిన సీసీఆర్ఏఎస్… వీరి నుంచి అభిప్రాయాలు, వివరాలు తీసుకోనున్నారు ఆయుర్వేద వైద్యులు. కరోనా పరీక్షల రిపోర్ట్, మందు…
ఆనందయ్య మందు కోసం జనం ఎగబడ్డారు. ఎక్కువ మంది పాజిటివ్ వారే వస్తున్నారు అని అధికారులు పంపిణీ నిలిపివేశారు అని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పెద్ద ఎత్తున మందు తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఐసీఎంఆర్ బృందం రేపు వస్తుంది. వారు నివేదిక ఇచ్చిన తరువాతనే పంపిణీ చేస్తాం అని అన్నారు. ప్రభుత్వం విధివిధానాలు వచ్చిన తరువాతనే మందు ఇస్తాం. అపోహలు, దుష్ప్రచారాలు చెయ్యడం మంచిది కాదు. ఆ మందు తో ప్రాణాలు నిలబడితే…
ఆనందయ్య మందు పంపిణీ పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే గత రెండు రోజులుగా ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ప్రస్తుతం నెల్లూరు అధికారుల ఆధీనంలో ఉన్నారు ఆనందయ్య. ఇక నిన్న ఆయూష్ కమిషనర్ రాములు సమక్షంలో మందు తయారు చేసారు ఆనందయ్య. అయితే ఆ మందులో హానికర పదార్థాలు లేవని ఆయూష్ కమిషనర్ పేర్కొన్నారు. కానీ ఆనందయ్య తయారు చేస్తున్న మందుని ఆయుర్వేదంగా గుర్తించలేమన్న రాములు… ఆనందయ్య తయారు చేస్తుంది నాటు మందుగా…
కృష్ణపట్నం కరోనా మందులానే రాజమండ్రిలోనూ మహమ్మరికి మందు తయారు చేస్తున్నారు. ఈ కరోనా మందును ఆయుర్వేద వైద్యుడు వసంత్ కుమార్ తయారు చేస్తున్నారు. 30 ఏళ్లుగా వసంత్ కుమార్ ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు.అదే అనుభవంతో వసంత్ కుమార్ కూడా కరోనాకు మందు తయారు చేస్తున్నాడు. అన్ని వనములికలతో చేస్తున్న ఈ మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవని వసంత్ కుమార్ చెబుతున్నాడు. వసంత్ కుమార్ పై నమ్మకంతో చాలా మంది అతని దగ్గరికి వస్తున్నారు. ప్రతి…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. కృష్ణపట్నం పేరు మారుమ్రోగుతోంది. కరోనాకు ఉచితంగా మందుపంపిణీ చేస్తుండడంతో.. ఇప్పుడు వేలాది మంది అటు పరుగులు తీస్తున్నారు. ఆనంద్ ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు.. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. ఇక, తాను తయారు చేస్తున్న మందులపై క్లారిటీ ఇచ్చారు ఆనందయ్య.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలకు అందుబాటులో ఉండే వస్తువులతో మందు తయారు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు పనితీరు.. గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు.. దాటేసింది.. దీంతో.. కోవిడ్ మందు కోసం తరలివచ్చినవారితో కృష్ణపట్నం జనసంద్రంగా మారిపోయింది.. దీంతో.. తాత్కాలికంగా పంపిణీని నిలిపివేశారు. ఇక, ఆయుర్వేద మందు పంపిణీపై స్పందించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఇవాళ సాయంత్రం ఐసీఎంఆర్ బృందం నెల్లూరు కి చేరుకుంటుందని.. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.. వేల…