ఆనందయ్య మందు కోసం జనం ఎగబడ్డారు. ఎక్కువ మంది పాజిటివ్ వారే వస్తున్నారు అని అధికారులు పంపిణీ నిలిపివేశారు అని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పెద్ద ఎత్తున మందు తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఐసీఎంఆర్ బృందం రేపు వస్తుంది. వారు నివేదిక ఇచ్చిన తరువాతనే పంపిణీ చేస్తాం అని అన్నారు. ప్రభుత్వం విధివిధానాలు వచ్చిన తరువాతనే మందు ఇస్తాం. అపోహలు, దుష్ప్రచారాలు చెయ్యడం మంచిది కాదు. ఆ మందు తో ప్రాణాలు నిలబడితే సీఎం కంటే సంతోష పడేవారు ఎవరూ ఉండరు. డీ సెంట్రలైజేషన్ ద్వారా మందు పంపినీ జరుగుతుంది. ఆయుష్ బృందం పర్యటన పూర్తి అయింది…రేపు ఐసీఎంఆర్ టీం కూడా వస్తుంది. ఆనందయ్య ను ఎవరూ అరెస్ట్ చెయ్యలేదు…. తప్పుడు ప్రచారం చేయవద్దు. వెంటనే ప్రారంభించాలని ఒకరు ప్రకటన ఇచ్చేసారు…. వాళ్ళ నాయకుడు అధ్యయనం జరగాలి అని కాకాని అన్నారు.