నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం పనితీరుపై పరిశోధన ప్రారంభించింది జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ. మొదటి దశలో ముందు తీసుకున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న సీసీఆర్ఏఎస్… విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన స్థానం, తిరుపతి ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రికి బాధ్యతలు అప్పగించింది సీసీఆర్ఏఎస్. నెల్లూరు జిల్లా ఎస్పీ సహకారంతో మందు తీసుకున్న 500 మంది వివరాలు సేకరించిన సీసీఆర్ఏఎస్… వీరి నుంచి అభిప్రాయాలు, వివరాలు తీసుకోనున్నారు ఆయుర్వేద వైద్యులు. కరోనా పరీక్షల రిపోర్ట్, మందు వేయించుకున్నప్పటి పరిస్థితి, తర్వాత పరిస్థితులు, ప్రస్తుత మెడికల్ రిపోర్ట్ లపై ఆరా తీస్తున్నారు. వివరాలను సీసీఆర్ఏఎస్ ఇచ్చిన ఆన్లైన్ ప్రొఫార్మా లో పొందు పరచనున్న ఆయుర్వేద వైద్యులు.. రెండు రోజుల్లో ఈ పనిని పూర్తిచేయాలని వైద్యులను ఆదేశించింది సీసీఆర్ఏఎస్. రోగుల పై మందు చూపించిన ప్రభావాన్ని విశ్లేషించడం ద్వారా ప్రాథమిక నిర్ధారణకు రానుంది సీసీఆర్ఏఎస్.