ఆనందయ్య ఆయుర్వేద మందు పై కేంద్ర ఆయుష్ సంస్థ తో కలిసి టీటీడీ ఆయుర్వేదిక్ కళాశాల అధ్యయనం చేస్తోంది అని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తాజాగా ఎన్టీవీతో టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ… ఆనందయ్య ఆయుర్వేద మందు తీసుకున్న 500 మందిని స్టడీ చేసే ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. ఐసీఎమ్మార్ దీనిలో చేయగలిగింది ఏమీ లేదు. కేంద్ర ఆయుష్ శాఖే నిర్ధారించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతుల తర్వాతే మందు విషయంలో ముందుకు వెళ్ళాలని సీఎం స్పష్టంగా చెప్పారు. సీసీఆర్ఎస్, టీటీడీ ఆయుర్వేద కళాశాల సమన్వయంతో అధ్యయనం జరుగుతోంది. దీని తర్వాత క్లీనికల్ ట్రయల్స్ చేయాల్సి ఉంది అని తెలిపారు. క్లీనికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇస్తుంది. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య ఆయుర్వేద మందు పై ఒక నిర్ణయం తీసుకుంటుంది. 5, 6 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.