రష్యాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతున్నది. ప్రతిరోజూ వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను రష్యా మొదటగా తయారు చేసినప్పటికీ, వ్యాక్సినేషన్ మిగతా దేశాలతో పోలిస్తే మందకోడిగా సాగుతున్నది. దీంతో కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. కట్టడి చేసేందుకు రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రికార్డ్ స్థాయిలో కేసులు పెరుగుతుండటంతో ఉద్యోగులను వారం రోజులపాటు పని ప్రదేశాలకు దూరంగా ఉంచితే మంచిదని ప్రభుత్వం భావించింది. అక్టోబర్ 30…
తెలంగాణ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 208 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 201 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,69,163 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,61,294 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3940 కు చేరుకుంది..…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,219 శాంపిల్స్ పరీక్షించగా.. 332 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 06 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 651 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,90,16,065 కు…
కరోనా మహమ్మారికి ప్రపంచ వ్యాప్తంగా 49 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శాస్త్రవేత్తల నిరంతర శ్రమ కారణంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మహమ్మారులకు వ్యాక్సన్‌ను తయారు చేయాలి అంటే కనీసం ఐదారేళ్ల సమయం పడుతుంది. కానీ, కరోనా నుంచి కోలుకోవాలి అంటే వ్యాక్సిన్ తప్పనిసరి కావడంతో ప్రపంచం మొత్తం వ్యాక్సిన్‌పైనే దృష్టి సారించింది. ఆరునెలల కాలంలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత…
చైనాలోని వ్యూహాన్ నగరంలో కరోనా మహమ్మరి తొలిసారి వెలుగుచూసింది. గడిచిన ఏడాదిన్నరగా ఈ మహమ్మరి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనా ధాటికి లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కోట్లాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. కరోనా మొదటి దశలో అగ్రదేశాలైన అమెరికా, చైనా, బిట్రన్, ఇటలీ, ఫ్రాన్స్ ఎక్కువ నష్టపోవాల్సి వచ్చింది. కరోనా తొలి వేవ్ ను సమర్ధవంతంగా భారత్ సెకండ్ వేవ్ లో మాత్రం మూల్యం…
భారత్‌లో మరోసారి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 14,146 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 144 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19,788 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,40,67,719 కు పెరగగా.. రికవరీ కేసులు 3,34,19,749కు…
కరోనా కొత్త కేసులపై దసరా పండుగ ప్రభావం స్పష్టంగా కనిపించింది.. దేశవ్యాప్తంగా ఇవాళ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. దీనికి ప్రధాన కారణం టెస్ట్‌ల సంఖ్య తగ్గడమే.. ఇక, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఏపీలోనూ టెస్ట్‌ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.. కొత్త కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి.. బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,243 శాంపిల్స్ పరీక్షించగా.. 332 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఏడుగురు కోవిడ్…
ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 16,862 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,37,592కి చేరింది. ఇందులో 3,33,82,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,03,678 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 379 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైనమొత్తం కరోనా మరణాల సంఖ్య 4,51,814కి చేరింది. ఇక ఉదిలా ఉంటే, గడిచిన…
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం 14 వేల కేసులు నమోదవ్వగా ఆ కేసులు ఇప్పుడు 15 వేలకు పైగా నమోదయ్యాయి. తాజాగా ఇండియాలో 15,823 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కి చేరింది. ఇందులో 3,33,42,901 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,07,653 కేసులు ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో…
దేశంలో కరోనా కేసులు నేడు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 18,132 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,71,607 కి చేరగా ఇందులో 3,32,93,478 మంది ఇప్పటికే కోలుకున్నారు. 2,27,347 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 193 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,50,782 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో…