కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి కొంత ఉపమనం కలిగిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య తగ్గిపోయింది. కరోనా వైరస్ సోకినా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే బయటపడుతున్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వీరి కోసం ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి వ్యాక్సిన్…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. పలు చోట్ల ఇంకా డబుల్ డిజిట్‌లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 171 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,72,489కి చేరింది. కరోనా నుంచి 6,64,759 మంది కోలుకోగా మొత్తం 3,966…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.. ఏపా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 30,831 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 215 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అలాగే తాజాగా ఒక్కరు మృతి చెందారు. ఇదే సమయంలో 406 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కారు. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,97,06,769 కు చేరగా.. మొత్తం పాజిటివ్…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో కరానోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా రాష్ట్రంలో 36,373 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 301 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారనైంది. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో ఇద్దరు కరోనా బారినపడి మృతి చెందగా.. 367 మంది కరోనా నుంచి కొలుకున్నారు. ప్రస్తుతం రాష్రంలో 3,830 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
మన దేశంలో ఇవాళ కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 11,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 311 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 14,159 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,51,209 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల…
మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ…తగ్గుతూ వస్తున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,514 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 251 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 12,718 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది. దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,85,814…
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 25,021 శాంపిల్స్ పరీక్షించగా… 121 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్క కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 183 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో… మొత్తం పాజిటివ్…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 174 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 202 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,174 కు చేరగా.. రికవరీ కేసులు 6,63,124 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలా కుతలం చేస్తున్నది. కరోనా కట్టడికి చాలా దేశాలు లాక్ డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా కరోనాతో ప్రపంచం ఇబ్బందులు పడుతున్నది. అయినప్పటికీ ఇప్పటి వరకు మహమ్మారి పూర్తిగా అంతం కాలేదు. ఎప్పటి కప్పుడు కొత్తగా మార్పులు చెందుతూ విరుచుకుపడుతున్నది. దేశాల ఆర్థిక పరిస్థితులను చిన్నాభిన్నం చేస్తోంది కరోనా. ఇక, కరోనా కట్టడికి ప్రతీ దేశం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తూ వస్తున్నాయి. అన్నింటికంటే అధికంగా బ్రిటన్ కరోనా కట్టడికోసం…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,350 శాంపిల్స్ పరీక్షించగా.. 567 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 8 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 437 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,93,65,385కు చేరగా.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు…