భారత్‌లో కరోనా పాజిటివ్ గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 20 రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పడిపోయాయి. తాజాగగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,051 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,38,524కి చేరింది. తాజాగా 206 మంది కరోనాతో మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,12,109కి చేరింది. డిచిన 24 గంటల్లో దేశ…
ఒక్క చిన్న వైరస్.. వందలాది దేశాలను వణికించింది. ఒకటి కాదు రెండేళ్ళకు పైనే అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లక్షలాదిమంది ఆ మహమ్మారికి బలయిపోయారు. కరోనా వైరస్ ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగిరావడంతో అనేక దేశాలు నిబంధనలు వదిలేశాయి. మనదేశంలో 25వేలకు లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. నెలక్రితం ఈ సంఖ్య రెండు లక్షలకు పైమాటే. కరోనా తగ్గిందని జనం బయట యథావిధిగా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. అంతేకాదు, కరోనా పరీక్షలను…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్నిరోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,407 కరోనా కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,25,86,544కి చేరింది. అయితే కరోనా మరణాలు మాత్రం నిలకడగా నమోదవుతున్నాయి. కొత్తగా 804 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,07,981కి పెరిగింది. అటు…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల ప్రతిరోజూ లక్షల్లో నమోదైన కేసులు ప్రస్తుతం 60వేలకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58,077 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,25,36,137కి చేరింది. తాజాగా కరోనా వల్ల 657 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,07,177కి పెరిగింది అటు తాజాగా దేశవ్యాప్తంగా…
దేశంలో ఆందోళన రేకెత్తించిన కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోయింది. బుధవారం కాస్త పెరిగిన కరోనా కేసులు గురువారం స్వల్పంగా తగ్గాయి. బుధవారం 71,365 కేసులు నమోదు కాగా గురువారం కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,241 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 5,06,520గా ఉంది.…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోయినట్లే కనిపిస్తోంది. ఫిబ్రవరి తొలివారంలో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్నటితో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 67, 597 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం 71,365 కేసులు వెలుగుచూశాయి. అంటే నిన్నటితో పోలిస్తే 4వేల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,10,976కి…
గత నెలరోజులుగా మహారాష్ట్రను కరోనా ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు అన్ని రంగాలు ఓపెన్ అయ్యాయి. కేసులు పెద్ద సంఖ్యలో తగ్గిపోవడంతో చాలా వరకు నిబంధనలను సడలిస్తూ వస్తున్నారు. త్వరలోనే పూర్తిస్తాయిలో నిబంధనలు సడలించే అవకాశం ఉన్నట్టు ముంబై మేయర్ ప్రకటించారు. ఈ నెలాఖరు నుంచి పూర్తిస్థాయిలో నిబంధనలు సడలించనున్నారు. అయితే, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ వంటివి పాటించాలని మేయర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబైలో…
కరోనా కేసులు దేశంలో తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. కరోనా పరీక్షల్లో ఖచ్చితమైన రిజల్ట్ రావాలి అంటే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిందే. ఆర్టీపీసీఆర్ లేదా పీసీఆర్ టెస్టులు చేయిస్తున్నారు. అయితే, వీటి రిజల్ట్ వచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోంది. ర్యాపిడ్ టెస్టులు చేయడం వలన ఖచ్చితమైన రిజల్ట్ రావడం లేదు. దీనికి పరిష్కారం కనుగొనేందుకు సింగపూర్ శాస్త్రవేత్తలు ఖచ్చితమైన రిజల్ట్ వచ్చేలా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కిట్‌ను తయారు చేశారు. ఈ కిట్‌తో పరీక్షలు నిర్వహిస్తే…
భారత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు మరో 1,27,952 మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1,059 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,059 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,30,814 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉన్నట్లు కేంద్ర…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా కేరళ రాష్ట్రంలో కేసులు భారీ సంఖ్యలో నమోదువుతున్నాయి. కేరళ రాష్ట్రంలో 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 51,887 కరోనా కేసులు నమోదైనట్టు కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 1205 మంది మృతి చెందారు. కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరగడంతో రాష్ట్రప్రభుత్వం అలర్ట్ అయింది. కేరళలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు మరింత కఠినంగా నిబంధనలు అమలుచేసేందుకు సిద్దమవుతున్నారు. Read: నావికా…