తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 65,263 కరోనా పరీక్షలు చేయగా… 2,484 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,045 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 138, రంగారెడ్డి జిల్లాలో 130, నల్గొండ జిల్లాలో 108, ఖమ్మం జిల్లాలో 107 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,207 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,61,050 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,18,241 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 38,723 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,086కి పెరిగింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించడంతో పాటు మాస్క్‌లు ధరించాలని వైద్యాధికారులు పేర్కొన్నారు.