యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఇంత జాప్యానికి కారకులు ఎవరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన.. ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వితో కలిసి బీహెచ్‌ఈఎల్ అధికారులతో యాదాద్రి పవర్ ప్లాంట్‌పై సమీక్షించారు. అగ్రిమెంట్ ప్రకారం 2020 అక్టోబర్ నాటికి రెండు యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో మూడు యూనిట్లు పూర్తి చేసుకొని మొత్తం 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించాల్సి ఉండగా, నిర్మాణం ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉండటానికి…
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో.. రామ మందిర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కాగా.. ఈ పనులు కొద్ది రోజుల్లో పూర్తవనుండగా, తర్వాత డెకరేషన్ వర్క్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. వేడుకకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అలంకరణ పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. న్యూ ఢిల్లీలోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
Sita Mandir Construction in Bihar: ప్రజల మనసు దోచకోవడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రామ మందిరంతో హిందువులకు దగ్గరైన బీజేపీ తరహాలోనే సీతా మందిర్ కట్టి వారికి దగ్గరవ్వాలని జేడీయూ భావిస్తున్నట్లు ఉంది. దీని కోసం సీతా దేవి జన్మించినట్లు చెబుతున్న సీతామర్హి జిల్లాలోని పునారా ధామ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీని కోసం మంత్రి వర్గ సమావేశంలో రూ.72.47 కోట్లకు ఆమోదం తెలిపారు. సీతామర్హి జిల్లా పునౌర…
Hyderabad: నగరంలోని ఓల్డ్ టౌన్ బహదూర్‌పురా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. దీంతో స్థానికులు పరుగులు పెట్టారు. దీంతో ఈ భవనం చుట్టుపక్కల ఉన్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు.
హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు. 69,100 కోట్లతో నగరం నలుదిశలా మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. మూడో దశలో 278 కిలోమీటర్ల పొడవు
వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు.. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి.